E-Paper
Advertisement

Harish Rao: కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం, పోలీసుల బలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రలోభాలకు గురిచేసినా.. తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల పోరాట పటిమ అద్భుతమని ఆయన కొనియాడారు. మెదక్ జిల్లా పాపన్నపేట, ఘనపూర్ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచులుగా గెలిచిన 26 మంది నూతన ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి హరీష్ రావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రలోభాలను అధిగమించి..?

Advertisement

సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికలను ప్రభావితం చేయాలని చూసిందని విమర్శించారు. డబ్బు సంచులతో ఓటర్లను ప్రలోభపెట్టాలని చూసినా, భయభ్రాంతులకు గురిచేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారని స్పష్టం చేశారు. నామినేషన్ల దశ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించారని.. ఏకగ్రీవాల పేరుతో ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అయినప్పటికీ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో నిలబడి విజయం సాధించారని.. ఈ గెలుపు కార్యకర్తల మనోధైర్యానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలే శాపనార్థాలు

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫలితాలు ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని చాటిచెప్పాయని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. పైగా గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు కోతలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాన్ని ప్రజలు గమనించారని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని అన్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించడం గర్వకారణమని హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.

భవిష్యత్ బీఆర్ఎస్ దే

రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ గారి నాయకత్వం కోసం, బీఆర్ఎస్ సుపరిపాలన కోసం మళ్లీ ఎదురుచూస్తున్నారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే గెలవడం శుభపరిణామన్నారు. ‘ప్రభుత్వం సహకరించకపోయినా మీరు ధైర్యంగా ఉండండి. మీ వెనుక పార్టీ ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి నిధులు సాధించుకుందాం’ అని నూతన సర్పంచులకు ఆయన భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నిబద్ధతతో పనిచేసి పార్టీ ప్రతిష్టను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

ALSO READ: Medak Crime: అయ్యో పాపం.. ఎంత పని చేశావ్ దేవుడా…? రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌డెడ్

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×