E-Paper
Advertisement

5 Months Old Baby Dies: దారుణం.. పసికందుపై దాడి చేసి చంపేసిన పెంపుడు కుక్క!

5 Months Old Baby Dies: దారుణం.. పసికందుపై దాడి చేసి చంపేసిన పెంపుడు కుక్క!
Advertisement

Pet Dog killed 5 – Month- Old Baby: వికారాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఐదు నెలల పసి బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. జిల్లాలోని తాండూరు మండలంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఇందుకు సంబంధించి వెలువడుతున్న వివిధ వార్తా కథనాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధి బసవేశ్వర నగర్ లో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలల బాలుడు ఉన్నాడు. పాలీష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా భర్తకు దాహం వేసింది. దీంతో అతను దాహం వేస్తుంది నీళ్లు తీసుకురావాలని  భార్యను కోరాడు. దీంతో భార్య ఇంట్లో ఆ పసికందును వదిలేసి నీళ్లు తీసుకుని తన భర్త వద్దకు వెళ్లింది. ఇంతలోనే అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఆ ఇంట్లోకి చొరబడింది. అనంతరం ఇంట్లో ఉన్న ఐదు నెలల పసికందుపై అతి క్రూరత్వంగా దాడి చేసింది. దీంతో 5 నెలల ఆ బాలుడు మృతిచెందాడు.

Advertisement

Also Read: హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాల్లో వర్షం పడొచ్చు..? ఎప్పుడంటే..?

అయితే, కుక్క దాడి చేసిన సమయంలో ఆ బాలుడు ఏడుస్తుండగా గమనించిన తల్లి హుటాహుటినా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ బాలుడు అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×