BigTV English

Double ISMART Teaser Date: రేపు దిమాక్కి కిరికిరి ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్.. రన్ టైం ఎంతంటే..?

Double ISMART Teaser Date: రేపు దిమాక్కి కిరికిరి ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్.. రన్ టైం ఎంతంటే..?

Double ISMART Teaser Out Tomorrow: ఎనర్జిటిక్ రామ్ పోతినేని ప్రస్తుతం భారీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. అయినా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు ఆకట్టుకోలేక పోతున్నాడు. అయితే ఈ సారి ఎలా అయినా మంచి హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ డైరెక్టర్‌తో మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ పేరే ‘డబుల్ ఇస్మార్ట్’.


సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఇక ఫస్ట్ పార్ట్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ పని అయిపోయిందని అంతా అనుకున్న టైంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి ట్రోల్స్‌కు చెక్ పెట్టింది.

అయితే ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్‌ విలన్ పాత్ర కోసం రంగం లోకి దిగడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు మరింత అంచనాలను పెంచేశాయి.


Also Read: Ram Pothineni – Double Ismart Teaser:‘డబుల్ ఇస్మార్ట్’.. బర్త్ డే ట్రీట్ అదిరింది..

ఇక ఇప్పుడు మరొక అప్డేట్‌‌ను మేకర్స్ అందించారు. అందరు అనుకున్నట్లు గానే ఈ మూవీ టీజర్‌ను మే 15న రామ్ పోతినేని బర్త్ డే రోజున రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ టీజర్‌ రన్ టైంను తెలిపారు. 85 సెకండ్ల నిడివితో దిమాక్కి కిరికిరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ రేపు రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో రామ్ పోతినేని లుక్ ఓ రేంజ్‌లో ఉంది.

https://twitter.com/Suraj70800/status/1790253433951555618

తన భుజంపై గన్ పట్టుకుని, సన్ గ్లాస్ పెట్టుకుని నిల్చున్న రామ్ పోతినేని స్టిల్ మామూలుగా లేదు. మరి ఈ సీక్వెల్‌కు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రేపు రిలీజ్ కాబోయే టీజర్ మరింత అంచనాలను పెంచుతుందా.. లేక నీరుగారుస్తుందా అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×