BigTV English

DC Vs LSG Match Preview: ఢిల్లీ గెలుస్తుందా..? నిలుస్తుందా..? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్.!

DC Vs LSG Match Preview: ఢిల్లీ గెలుస్తుందా..? నిలుస్తుందా..? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్.!

IPL 2024 64th Match – Delhi Capitals Vs Lucknow super Giants Preview: ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ లోకి వెళ్లే జట్లు ఒకొక్కటి బయటపడుతున్నాయి. నేడు ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య జరగనున్న మ్యాచ్ లో ఢిల్లీ కానీ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఒక వేళ గెలిస్తే మాత్రం 14 పాయింట్లతో మిగిలిన జట్లు తమ రౌండ్స్ అన్నీ పూర్తయ్యేవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది.


అదే లక్నో వరకు వస్తే ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. ఇప్పుడు రెండు గెలిస్తే 16 పాయింట్లతో సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఒకటి ఒడి, ఒకటి గెలిస్తే మాత్రం లక్నో కూడా 14 పాయింట్లతో ఉంటుంది. దీంతో రన్ రేట్ ప్రకారం ఆర్సీబీకి ఊపిరి పోసినట్టు అవుతుంది.

ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో ఒకటి ఢిల్లీ గెలిస్తే, రెండింటిలో లక్నో విజయం సాధించింది.


Also Read: 12 లో ముగ్గురు, 14లో ఇద్దరు.. ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కి వెళ్లేదెవరు?

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈసారి మ్యాచ్ లో అన్యమనస్కంగానే ఆడేలా కనిపిస్తున్నాడు. అందువల్ల మ్యాచ్ గెలుస్తుందనే నమ్మకం ఏ కోశానా లేదు. ఎందుకంటే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా పది మందిలో బూతులు తిట్టిన నేపథ్యంలో తన పరువు పోయింది. దీంతో లక్నోని వదిలేసి, వచ్చే ఏడాది వేలంలో తను పాల్గొనే అవకాశాలున్నాయి.

అందుకనే నేటి మ్యాచ్ లో ఆడితే ఆడతాడు, లేకపోతే లేదన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. జట్టు అంతటిలో కూడా అదే కనిపిస్తోంది. బహుశా ఇది ఢిల్లీకి కలిసి వస్తుందేమోనని అనుకుంటున్నారు. అయితే క్రికెట్ లో ఏదైనా జరగవచ్చు. కేఎల్ మనస్ఫూర్తిగా ఆడకపోయినా జట్టులో ఒకరిద్దరు క్లిక్ అయినా పరిస్థితులు వీరికి అనుకూలంగా మారతాయి. అదెంత వరకు సఫలీక్రతం అవుతుందనేది వేచి చూడాలి.

Also Read: Sanjiv Goenka KL Rahul Controversy: అది మా మధ్య టీ కప్పులో తుఫాను లాంటిది..

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో ఎలా ఆడినా తర్వాత పుంజుకుని మంచి స్థితికి వచ్చింది. అయితే అనూహ్యంగా తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయి డీలాపడిపోయింది. కానీ ఇప్పుడు గట్టిగా క్రషి చేస్తే లక్నోని ఆపవచ్చునని అంటున్నారు. ఆ తర్వాత 14 పాయింట్లతో మిగిలిన జట్లతో ప్లే ఆఫ్ రేస్ లోకి వెళ్లే అవకాశాలున్నాయి. అందువల్ల ఆఖరి మ్యాచ్ లో నైనా ఢిల్లీ గట్టిగా ఆడుతుందని అంతా అనుకుంటున్నారు. మరేం జరుగుతుందనేది నేటి మ్యాచ్ లో చూడాల్సిందే.

Tags

Related News

UAE Vs IND : UAE పై టీమిండియా భారీ విక్టరీ.. నాలుగు ఓవర్ల లోనే మ్యాచ్ ఫినిష్

IND Vs UAE : కుల్దీప్ అరాచ‌కం..ఒకే ఓవ‌ర్ లో 3 వికెట్లు…కుప్ప‌కూలిన యూఏఈ

Boycott IND vs PAK : టీమిండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌…కార‌ణం ఇదే

IND vs UAE, Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా…ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

IND vs PAK: టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు బిగ్ షాక్‌..చూసేవాడే క‌రువ‌య్యాడు.. ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదు..!

T20 World Cup 2026 : 2026 టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే… ఫైనల్ అక్కడే… పాకిస్తాన్ లేకుండానే!

Big Stories

×