BigTV English

Call Girl Deadbody: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

Call Girl Deadbody: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

Call Girl Deadbody| తను ప్రేమించిన యువతిని పొందడానికి ఒక యువకుడు అతి దారుణంగా వ్యభిచారం చేసే మహిళ ను హత్య చేశాడు. కాల్ గర్ల్ తల నరికి తన ప్రియురాలి సోదరుడి ఇంట్లో దొంగచాటుగా పెట్టాడు. అయితే అతని కుట్ర ఫలించలేదు. తను పన్నిన వలలో తనే చిక్కుకున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ నగర సమీపంలో ఉన్న పాండర్ పలా ఇస్లాంపూర్ చెందిన ఇర్ఫాన్ అన్సారీ (41) కి ముంబైలో నివసించే పర్వీన్ హసీనాతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అన్సారీ అడ్వర్టైజింగ్ యాడ్ కంపెనీలకు సంబంధించి రోడ్లపై ఫ్లేక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. అయితే ఇర్ఫాన్ భార్య కొనేళ్ల క్రితం అతడిని వదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత ఇర్ఫాన్ తన స్వ గ్రామం తిరిగి వచ్చేసాడు. గ్రామంలో నీలిమ అనే యువతితో అతను ప్రేమలో పడ్డాడు.

నీలవ భర్త చనిపోయాడు. అమె వితంతువు. వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఇర్ఫాన్ పోలీసులకు తెలిపాడు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాడు. కానీ నీలిమ ఇద్దరు సోదురులకు ఇర్ఫాన్ అంటే ఇష్టం లేదు. అందుకే అతడితో తమ సోదరి వివాహం కుదరదని చెప్పారు. ఒక రోజు నీలిమ, ఇర్ఫాన్ ఒంటరిగా కలుసుకోవడం చూసి వారిద్దరూ ఇర్ఫాన్ ని చితకబాదారు. ఆ తరువాత నుంచి ఇర్ఫాన్ తన ప్రేయసి నీలిమను కలుసుకోవడానికి కష్టంగా మారింది.


Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

దీంతో తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఇర్ఫాన్ ఒక ప్లాన్ వేశాడు. నీలిమ సోదరులు అడ్డుతొలగించుకొని నీలిమను పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అందుకే ఒక హత్య చేశాడు. గ్రామంలో రైల్వే స్టేషన్ వద్ద రాత్రి వేళ వ్యభిచారం చేసి యువతిని ఇటీవల వెళ్లి కలిశాడు. ఆమెతో శారీరక సుఖం పొందాలనుకున్నాడు. అందుకోసం ఆమెకు ఫోన్ చేసి తనతో రమ్మని చెప్పాడు. ఆ తరువాత ఆమెను తీసుకొని గ్రామ పొలిమేర వద్ద చెరువు గట్టు వద్దకు తీసుకెళ్లాడు. ఆ తరువాత అదును చూసి వ్యభిచారం చేసి మహిళ గొంతును కోశాడు. ఆమె ప్రాణం పూర్తిగా పోయాక.. ఆమె తల నరికి ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టాడు. ఆ తరువాత ఆమె శవాన్ని చెరువు గట్టు వద్ద దాచిపెట్టాడు.

శవం తలకు పసుపు పూసి.. ఆ తలను తన ప్రియురాలు నీలిమ ఇంట్లో దొంగచాటుగా పెట్టాడు. ఆ తరువాత ఆ తల ఫొటోలు, వీడియోలు తీసి ఇంటర్నెట్ వైరల్ చేశాడు. ఆ భయంకరమైన ఫొటోల ”కింద చేతబడి జరుగుతోంది. పోలీసుకు ఏం చేస్తున్నారు?” అని కాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఇర్ఫాన్ ప్లాన్ పనిచేయలేదు.

Also Read: మిస్ కాల్ తో మొదలైన ప్రేమ.. ప్రియుడిని వివాహం చేసుకోవడానికి హంతకురాలిగా మారిన లేడి!

నీలిమ సోదరులు తమ ఇంట్లో ఎవరో యువతి శవం తల ఉందని పోలీసులకు తెలిపారు. ఆ తరువాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. విచారణ మొదలు పెట్టారు. అయితే పోలీసులు ముందుగా ఇంటర్నెట్ లో ఆ శవం ఫొటోలు ఎవరు పెట్టారు అనే అంశంపై ఆరా తీశారు. అలా ఇర్ఫాన్ మొబైల్ తో ఆ శవం వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఇర్ఫాన్ కోసం గాలించి అతడిని అరెస్టు చేశారు.

ఆ తరువాత ఇర్ఫాన్ ని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా.. అతను తనే హత్య చేసినట్లుగా అంగీకరించాడు. తన ప్రియురాలిని దక్కించుకునేందుకే ఈ హత్య చేశానని చెప్పాడు. శవం తల నరికి దానికి పసుపు పూసి.. క్షుద్ర పూజ జరిగినట్లుగా ఫొటోలు తీశానని తెలిపాడు. హత్య కేసులో నీలిమ సోదరులు జైలుకెళితే.. తన ప్రియురాలిని ఏ అడ్డూ లేకుండా కలుసుకోవచ్చునని  భావించి ఈ హత్య చేశానని తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ.. కోర్టులో సాగుతోంది.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×