ExtraMarital Love| ఒక మహిళ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. తన ప్రియుడి కోసం ఏమైనా చేస్తుందనడానికి ఉదాహరణగా బిహార్ లో తాజాగా ఒక మహిళ హంతకురాలిగా మారింది. అనుకోకుండా ఒక రోజు తన ఫోన్ కు వచ్చిన మిస్ డ్ కాల్ తో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ప్రతిరోజు అతనితో మాట్లాడేది. అలా వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే అనుకోకుండా ఆ మహిళ భర్త విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. దీంతో ఆమెకు తన ప్రియుడితో కలుసుకోవడానికి వీలుండేది కాదు. అప్పుడు ఆమె తన ప్రియుడిని పెళ్లిచేసుకోవడానికి ఒక ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో వారిద్దరూ హత్య కేసు లో అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని మోతిహారి నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మోతిహారి నగరంలో నివసించే జమీలా బేగం అనే 30 ఏళ్ల యువతికి 10 ఏళ్ల క్రితం ఆఫ్తాబ్ అనే యువకుడితో వివాహం జరిగింది. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఆఫ్తాబ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే భార్యాపిల్లలను వదిలేసి దుబాయ్ లో ఉంటూ.. రెండేళ్ల కోసారి ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చినా మూడు నెలల తరువాత తిరిగి వెళ్లిపోతాడు. ఈ కారణంగా భర్త లేక ఎక్కువ కాలం జమీల ఒంటరిగా గడిపేది. పైగా తరుచూ తన పుట్టింటికి వెళ్లిపోయేది.
ఈ క్రమంలో జమీలా ఫోన్ కు ఒకరోజు మిస్ కాల్ వచ్చింది. ఆ మిస్ కాల్ పొరపాటున చేసిన యువకుడే రోహిత్ (28). రోహిత్ సరదాగా మాట్లాడే మనస్తత్వం కలవాడు. దీంతో ఒంటరిగా ఉన్న జమీలా.. సరదాగా మాట్లాడే రోహిత్ తో స్నేహం చేసింది. దీంతో వారిద్దరూ ప్రతిరోజు మాట్లాడేవాడు. అలా స్నేహం కాస్తా ప్రేమగా మారిపోయింది. జమీలా ఎక్కువ సమయం తన పుట్టింట్లో గడపుతుండడంతో ఆమెను కలవడానికి రోహిత్ అక్కడికే వచ్చేవాడు. అలా మూడేళ్లుగా జమీలా, రోహిత్ మధ్య ప్రేమయాణం నడుస్తోంది.
అయితే ఇటీవల జమీలా భర్త ఆఫ్తాబ్ ఒక రోజు దుబాయ్ నుంచి తిరిగివచ్చాడు. రాగానే జమీలాను ఆమె పుట్టింటి నుంచి తీసుకొచ్చేశాడు. దీంతో జమీలా, రోహిత్ కలుసుకోలేకపోయేవారు. కానీ ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇద్దరు ప్రేమికుల విరహాన్ని తట్టుకోలేకపోయేవారు. ఈ సారి ఆఫ్తాబ్ దుబాయ్ తిరిగి వెళ్లడం లేదని తెలిసి వారి సమస్యలు ఇంకా పెరిగిపోయాయి. అయితే ఒక రోజు జమీలా.. తన స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానని చెప్పి రోహిత్ ని కలిసేందుకు వెళ్లింది.
అలా రోహిత్ తో కలిసి అతడిని పెళ్లి చేసుకునేందుకు ఒక ప్లాన్ వేసింది. వారిద్దరూ పెళ్ల చేసుకోవాలంటే ఆఫ్తాబ్ చనిపోవాలని చెప్పింది. తన భర్త చనిపోయిన తరువాత పెళ్లి చేసుకుందామని తెలిపింది. దీనికోసం తన ప్రియుడికి రూ.3 లక్షలు విలువగల నగలు ఇచ్చింది. రోహిత్ ఆ నగలు విక్రయించి వచ్చిన డబ్బులతో కొంతమంది రౌడీలు, ఒక స్కార్ పియో కార్ అద్దెకు తీసుకున్నాడు.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
అలా ప్లాన్ ప్రకారం.. రోహిత్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ముందు ఆఫ్తాబ్ ఏ ప్రాంతంలో తిరుగుతున్నాడో.. రెక్కీ నిర్వహించి తెలుసుకున్నారు. ఒక రోజు ఆఫ్తాబ్ ఇంటి నుంచి బయటికి వెళతుండగా.. ఒక స్కార్పియో కారు ఒక్కసారిగా వచ్చి అక్కడికి ఆగింది. వారంతా ఆఫ్తాబ్ ని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఊరి బయటకు తీసుకెళ్లారు. అక్కడ ఆఫ్తాబ్ కడుపులో రోహిత్, అతని ఇద్దరు స్నేహితులు కత్తులతో పొడిచారు. దీంతో వారిమధ్య ఘర్షణ జరిగింది. ఆఫ్తాబ్ అరుపులు విని అక్కడ గ్రామస్తులు పరిగెత్తు కుంటూ వచ్చారు. రోహిత్ స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ రోహిత్ ని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఆఫ్తాబ్ ని గ్రామస్తులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు.. రోహిత్ ను గట్టిగా విచారణ చేయగా.. అతని ఫోన్ డేటాతో ఇదంతా ప్లాన్ వేసింది జమీలీ అని తెలిసింది. దీంతో పోలీసులు జమీలాను కూడా అరెస్టు చేశారు. పోలీసులు విచారణలో జమీలా తన భర్త హత్యకు కుట్ర పన్నానని అంగీకరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతోంది.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని