E-Paper
Advertisement

AP News: పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ సూసైడ్

AP News: పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ సూసైడ్
Advertisement

AP News: చిత్తూరు జిల్లా పుంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న CRPF కానిస్టేబుల్ కె. చెన్నారెడ్డి ఆత్మహత్య. అనంతపురం జిల్లా రేగడికొత్తూరు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, గత కొంతకాలంగా రామచంద్రయాదవ్‌కు భద్రతా సిబ్బందిగా సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన పుంగనూరులోని టీచర్స్ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

అయితే జీవితాన్ని ఎంతో భారంగా భావించిన చెన్నారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన రామచంద్రయాదవ్ నివాసానికి సమీపంలోనే చోటుచేసుకుంది. చెన్నారెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు, తోటి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, ఆయన అప్పటికే మృతి చెంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

చెన్నారెడ్డి ఆత్మహత్యపై రామచంద్రయాదవ్ స్పందిస్తూ.. ఇది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన ఘటన అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా చెన్నారెడ్డి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఆ ఒత్తిడి భరించలేకనే ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని వెల్లడించారు. విధి నిర్వహణలో ఆయన ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని, ఇలా జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: హైదరాబాద్-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

Advertisement

అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇది కేవలం కుటుంబ సమస్యలేనా లేక మరేదైనా పని ఒత్తిడి కారణమా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×