Serial Killer: అతని కంట మగవారు కనిపించారా.. ముందు మాటలు, ఆ తర్వాత అదే కానిచ్చేస్తాడు. ఆపై హత్య చేసి, ధోకెబాజ్ (మోసగాడు) అంటూ రాసేస్తాడు. 18 నెలల్లో 11 మందిని హత్య చేశాడు ఆ సీరియల్ కిల్లర్. ఇతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
పంజాబ్ హోషియార్‌పూర్ లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల సరూప్ కూలీ నాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యానికై బానిసయ్యాడు. అలాగే డ్రగ్స్ కూడా సేవించడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో మాత్రం సరూప్ ఒక రాక్షసుడిగా మారిపోతాడు. ఈ క్రమంలో హత్యలకు పాల్పడేవాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరిగేవాడు. అయితే ఆగస్ట్ 18న టోల్‌ప్లాజా మోడ్రా వద్ద టీ అంగడి వ్యక్తిని హత్య చేశాడు. ఆ హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సరూప్ గా పోలీసులు గుర్తించారు. దీనితో అతడిని రూపనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంపి కాళ్లకు దండం పెట్టే అలావాటు..
సరూప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. పోలీస్ స్టైల్ లో సరూప్ ను విచారిస్తే, అసలు విషయాన్ని బయటకు వెళ్లగక్కాడు. 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసినట్లు అంగీకరించిన సరూప్ హత్యకు దారితీసే కారణాలు తెలిపాడు. సరూప్ బైక్ పై వెళ్ళే సమయంలో లిఫ్ట్ అడిగిన వారిని ఎక్కించుకుంటాడు.
అది కూడా కేవలం మగవారినే ఎక్కించుకొని, మాటలు కలుపుతాడు. అలా మాటలు కలిపి, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి, వారిపై లైంగిక చర్యలకు పాల్పడతాడు. ఇలా దుశ్చర్యకు పాల్పడిన అనంతరం వారి వద్ద డబ్బులు డిమాండ్ చేయడం సరూప్ కి అలవాటు. ఎవరైనా అసలు విషయం బయటకు తెలిపినా, డబ్బులు ఇవ్వకున్నా చేతిలో గుడ్డతో హత్యకు పాల్పడడం ఇతని నైజం. అంతేకాదు హత్య చేసిన తరువాత, చనిపోయిన వారి కాళ్లు మొక్కి క్షమించమని వేడుకోవడం, మృతుడి వీపుపై మోసగాడు అని రాయడం ఇతని అలవాటుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read: Keerthy Suresh : అభ్యంతరకరంగా వీడియోలు… ముంబై ఫోటోగ్రాఫర్లపై కీర్తి ఫైర్
స్వలింగ సంపర్కం అలవాటుతో..
స్వలింగ సంపర్కం అలవాటుగా గల సరూప్, పెళ్లైనా కూడా ఆ అలవాటు మానలేకపోయాడు. నిరంతరం స్వలింగ సంపర్కం కోసం పాకులాడే విషయం అతని భార్యకు తెలిసింది. పెళ్లై ముగ్గురు సంతానం గల సరూప్, అలవాటు మార్చుకోక పోవడంతో భార్య, పిల్లలు కూడా అతనికి దూరమయ్యారట. దీనితో కిల్లర్ గా మారి, సీరియల్ హత్యలు చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా ఉండేవాడు. అయితే టీ బంకు వద్ద వ్యక్తి హత్య కేసులో మాత్రం పోలీసులకు పట్టుబడి, 11 హత్యల గురించి చెప్పేశాడు. ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ సరూప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.