Keerthy Suresh : అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ‘బేబీ జాన్’ (Baby John) సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సౌత్ హీరోయిన్లు నార్త్ కల్చర్ కి అలవాటు పడడానికి కాస్త టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ పాపరాజి పేరుతో ఫోటోగ్రాఫర్లు ఎక్కడ పడితే అక్కడ నటీనటులను ఫోటోల పేరుతో వెంబడిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసారంటూ కీర్తి సురేష్ టీం ముంబైలో ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అవుతున్న వీడియో ఒకటి నెటింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవల కీర్తి సురేష్ (Keerthy Suresh) తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన వెంటనే ముంబైలో తన ఫస్ట్ హిందీ మూవీ ‘బేబీ జాన్’ ప్రమోషన్స్ కి వెళ్ళిపోయింది. పసుపు తాడుతో ఈ కొత్త పెళ్లికూతురు రాక ముంబై మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. కీర్తి సురేష్ (Keerthy Suresh), వరుణ్ ధావన్ (Varun Dhawan) జంటగా నటించిన ‘బేబీ జాన్’ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా గత కొన్ని రోజుల నుంచి కీర్తి సురేష్ ముంబైలోనే ఉంటుంది. అయితే తాజాగా వైరల్ అయిన వీడియో నిన్న రాత్రికి సంబంధించింది.
‘బేబీ జాన్’ మూవీ ప్రీమియర్ షోకి కీర్తి సురేష్ (Keerthy Suresh) వెళ్లినట్టుగా తెలుస్తోంది. షో పూర్తయ్యాక బయటకు వచ్చి తన కార్ ఎక్కుతుండగా కీర్తి సురేష్ టీం, అక్కడి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లతో గొడవ పడుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీయడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా కొన్ని సంస్థలతో సెలబ్రిటీలు ప్రమోషన్స్ కోసం ఈ పాపరాజీ అనే కల్చర్ కోసం డీల్ కుదుర్చుకుంటారు అనే టాక్ కూడా ఉంది. అందుకే వాళ్ళు సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇదే క్రమంలో నిన్న కీర్తి సురేష్ (Keerthy Suresh) కారు ఎక్కుతుంటే పలువురు ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. దీంతో కీర్తి సురేష్ టీంకు సంబంధించిన ఓ మహిళ ఆమె కారు ఎక్కుతున్నప్పుడు ఇలాంటి ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? అభ్యంతరకర వీడియోలను ఎలా తీయగలుగుతారు? కార్లోకి ఎక్కిన తర్వాత తీసుకోండి అంటూ ఫోటోగ్రాఫర్లతో వాదనకు దిగింది. ఇదంతా విన్న కీర్తి సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. కారులో నుంచి ఇదంతా గమనించి, తన చీర సర్దుకోవడం కనిపిస్తోంది. మరోవైపు ఫోటోగ్రాఫర్లు మేమేమీ అలా తీయలేదు, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా ఏంటి ? అంటూ కీర్తి సురేష్ టీంకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే కీర్తి సురేష్ (Keerthy Suresh) అక్కడి నుంచి కార్లో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.