BigTV English

E-PAN Card scam : హడలెత్తిస్తున్న పాన్ కార్డ్ స్కామ్స్! అసలు ఎలా మెుదలవుతుందంటే!

E-PAN Card scam : హడలెత్తిస్తున్న పాన్ కార్డ్ స్కామ్స్! అసలు ఎలా మెుదలవుతుందంటే!

E-PAN Card scam : స్కామ్స్.. ఎలా జరుగుతున్నాయి? ఎలా మొదలవుతున్నాయి? అనే విషయం తెలియకుండానే అకౌంట్ లో ఖాతాలో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. కళ్ళు తెరిచి మూసేలోగా లక్షలు, కోట్లు బదిలీ అయిపోతున్నాయి. స్కామర్స్ తెలియకుండానే వలలో వేసుకుంటూ మోసం చేసేస్తున్నారు. ఏదో ఒక రకంగా ప్రయత్నాలు జరిపి మోసాలకి పాల్పడుతున్నారు. ఇక ఇప్పటికే ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉండగా తాజాగా ఈ పాన్ కార్డ్ స్కామ్స్ హడలెత్తిస్తున్నాయి.


డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్, బ్యాంక్ క్రైమ్స్, డిజిటల్ చెల్లింపులు, వర్క్ ఫ్రమ్ హోం స్కామ్స్, ఈ-మెయిల్ స్కామ్స్ వంటివి ఎన్నో ఈ మధ్యకాలంలో జరుగుతూ ప్రతీ ఒక్కరిని భయపెడుతున్నాయి. తాజాగా ఈ పాన్ కార్డు స్కామ్ ప్రతీ ఒక్కరిని హడలెత్తిస్తుంది. ఈ పాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడంలో మీకు సహాయం చేయాలా? క్లైమ్ చేస్తూ మీకు సహాయం చేస్తాం అంటూ ఈ మెయిల్ కి వచ్చే మెసేజెస్ తో ఎంతోమంది నష్టపోతున్నారు. అయితే అసలు ఈ పాన్ కార్డ్ స్కామ్ ఎలా జరుగుతుంది? ఎలా మొదలవుతుంది? నకిలీ ఈ మెయిల్స్ ను ఎట్లా గుర్తించాలి? అనే విషయాలు తెలుసుకుందాం

నిజానికి ఈ స్కామ్స్ ఎంతో పగడ్బందీగా జరుగుతున్నాయి. ఈ పాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి అంటూ వచ్చిన ఈమెయిల్ తో స్కామ్ మొదలవుతుంది. కొత్తగా వచ్చిన పాన్ 2.0 ను ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. నిజానికి పాన్ 2.0కు అప్డేట్స్ అవసరం. దీన్ని ఆసరాగా చేసుకుని స్కామర్స్ పాన్ కార్డును అప్డేట్ చేస్తామంటూ, క్లైమ్ చేస్తామంటూ ఎన్నో మోసానికి పాల్పడుతున్నారు. మీ పాన్ కార్డ్ డేటా జాగ్రత్తగా ఉంచుతామంటూ, ఇందుకు తగిన డేటా మీరే రక్షించుకోవాలని క్యూఆర్ కోడ్ తో యూనిఫైడ్ పోర్టల్ లో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలంటే చెబుతూ సైబర్ క్రిమినల్స్ కొత్తరకం మోసాలకు తెరతీస్తున్నారు.


తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ చేస్తున్నామంటూ తప్పుడు ఈమెయిల్స్ పంపిస్తారని, ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఈ పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడంలో మీకు సహాయం చేస్తామంటూ వచ్చే మెయిల్స్ మొత్తం ఫేక్ అంటూ తెలిపింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది పీబీఐ. ఇప్పటికే ఇలాంటి ఈ మెయిల్ మీకు వచ్చి ఉంటే వాటిని క్లిక్ చేయొద్దని తెలిపింది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మాత్రమే ఈ పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాలని.. ఇలా మెయిల్ కు వచ్చిన లింక్స్ నమ్మి వాటిని ఓపెన్ చేయెుద్దని తెలిపింది. ఈ మెయిల్స్, కాల్స్, ఎస్ఎంఎస్ ఇలా ఏ విషయానికి స్పందించకుండా ఉండాలని.. ఆర్థిక, వ్యక్తిగత విషయాలు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించింది.

ఈ రకం మెయిల్స్ వ్యక్తిగత, ఆర్దిక సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉందని.. అందుకే ఏ మాత్రం అనుమానాస్పదంగా ఉన్న ఈ మెయిల్ మెసేజ్ వస్తే రియాక్ట్ కావొద్దని తెలిపింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కు సంబంధించిన ఎలాంటి ఈ మెయిల్ కు రెస్పాండ్ కావొద్దని తెలిసింది. ఒకవేళ అలాంటి ఈ మెయిల్స్ చూస్తే ఒకటికి రెండుసార్లు కచ్చితంగా చెక్ చేసుకోవాలని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి గుర్తించాలని తెలిపింది.

ALSO READ : ఆన్లైన్ పేమెంట్స్.. ఆపేదెవ్వరు! ఒక్క ఏడాదిలో ఎంత మార్పు

Related News

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Big Stories

×