Puri Beach: ఒడిశాలోని పూరీ బీచ్‌లో దారుణం జరిగింది. 19 ఏళ్ల విద్యార్థిణిపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బీచ్ సమీపంలో ప్రియుడి కళ్ల ముందు ఈ ఘోరం జరిగింది. అసలు బీచ్‌లో జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో ఒడిషాలో రకరకాల ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శనివారం సాయంత్రం పూరీ బీచ్‌లో దారుణమైన ఘటన జరిగింది. 19 ఏళ్ల ఓ యువతి సాయంత్రం వేళ తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లింది. వారు కూర్చున్న సమయంలో వారిని తమ సెల్‌ఫోన్‌లో బంధించారు నలుగురు యువకులు.
దీన్ని గమనించిన యువతీయువకుడు వాటిని ఫోన్ నుంచి తొలగించాలని కోరారు. ఈ క్రమంలో పోకిరీలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. డబ్బులు ఇచ్చేందుకు వారిద్దరు నిరాకరించారు. వచ్చినవారు నలుగురు యువకులు కావడంతో తొలుత యువకుడ్ని చెట్టుకి కట్టేశారు. అందులో ఇద్దరు యువతిపై అత్యాచారం చేశారు.
అక్కడి నుంచి ఇంటికి పోయింది యువతి. వేధింపుల గాయం నుండి బయటపడిన తర్వాత సోమవారం టీనేజ్ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నలుగురు నిందితులు స్థానికులే. అరెస్టుకు ముందు నిందితులు ఆ ఫుటేజ్ తొలగించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు.
ALSO READ: గద్వాల జిల్లాలో దారుణం.. నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య
ఈ మధ్యకాలంలో ఒడిశాలో అత్యాచార ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. గత బుధవారం భువనేశ్వర్‌లోని ఓ లాడ్జిలో ఒక మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి పెద్ద మ్యూజికల్ బ్యాండ్‌లో అవకాశం ఇప్పిస్తామని నమ్మించి లాడ్జ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు మత్తు పానీయం ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను శనివారం అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 5న గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని వెళ్లిన 14 ఏళ్ల బాలికపై కంధమాల్‌లో 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి ఐదు రోజుల తర్వాత నిందితుడ్ని అరెస్టు చేశారు. బాధిత విద్యార్థి 9వ తరగతి చదువుతోంది. తన కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి వాహనంలో ఆమెపై అత్యాచారం చేశాడు.