ఈస్ట్ కోస్ట్ రైల్వే తన పరిధిలోని పలు సెక్షన్లలలో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా జాజ్ పూర్ కియోంజార్ రోడ్- భద్రక్ సెక్షన్ మధ్య భద్రతకు సంబంధించిన ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకల్లో తాత్కాలికంగా కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు అమలుల్లో ఉంటాయని తెలిపింది. పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంతకీ ఆ పనులు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న రైళ్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పూరి–జలేశ్వర్–పూరి మెము (68442/68441) రైళ్లు సెప్టెంబర్ 16, 19, 20, 22 తేదీలలో(సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. అటు భద్రక్ మెము (68424) రైలు సెప్టెంబర్ 17, 21 (మంగళవారం, శనివారం) తేదీలలో జాజ్ పూర్ కియోంజార్ రోడ్ దగ్గర స్వల్పంగా రద్దు చేయనున్నారు. అటు భద్రక్ – కటక్ మెము (68423) అదే రోజుల్లో భద్రక్‌కు బదులుగా జా జ్‌పూర్ కియోంజార్ రోడ్ నుండి బయలుదేరుతుంది. కటక్ – భద్రక్ మెము (68438) రైలు సెప్టెంబర్ 19, 22 (గురువారం, ఆదివారం) తేదీలలో జాజ్ పూర్ కియోంజార్ రోడ్ దగ్గర స్వల్ప సమయం పాటు రద్దు చేయనున్నారు. అటు భద్రక్ – కటక్ మెము (68437)కూడా జాజ్ పూర్ కియోంజార్ రోడ్ నుంచి బయలుదేరుతుంది.
Read Also: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!
హౌరా – సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ (12703) సెప్టెంబర్ 17, 21 (మంగళవారం మరియు శనివారం) తేదీలలో 1 గంట 30 నిమిషాలు రీ షెడ్యూల్ చేయబడింది. చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్ (12840) సెప్టెంబర్ 18, 21 (బుధవారం, శనివారం) తేదీలలో 2 గంటలు తిరిగి షెడ్యూల్ చేయబడింది. పూరి-జైనగర్ ఎక్స్ ప్రెస్ (18419) సెప్టెంబర్ 19 (గురువారం)న 1 గంట ఆలస్యంగా షెడ్యూల్ చేయబడింది.
పలు రైళ్ల రాకపోకల్లో కీలక మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణీకులకు కీలక సూచనలు చేశారు. ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.
Read Also: దీపావళికి ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే?