ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభ వార్త తెలిపింది. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలుకు సిఎమ్ చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేసింది. గత YCP ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో 10 వేల రూపాయలు అందించింది. ఈసారి ఏకంగా TDP ప్రభుత్వం 15వేల రూపాయలు అందించేందుకు సిద్దం అయ్యింది.ఏపీ లో 2లక్షల 90 వేల ఆటోలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు.సొంత ఆటో ఉన్న వాళ్లకి ఏకంగా 15 వేల రూపాయలు డ్రైవర్ల ఖాతాలో పడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ లోపు ధరకాస్తు చేసుకొవాలని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 1వ తేది నాటికి చంద్రబాబు చేతుల మీదుగా అర్హులైన లభ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కానుంది.