BigTV English

Husband Sets House on fire: భార్యాభర్తల మధ్య గొడవ.. ఇల్లు తగలబెట్టిన భర్త

Husband Sets House on fire: భార్యాభర్తల మధ్య గొడవ.. ఇల్లు తగలబెట్టిన భర్త

Husband sets house on fire: రానురాను కొందరి మనుషుల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అటుపై ఆ కోపం ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అర్థం కావడంలేదు. ఆ కోపం వల్ల మనో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి అడవి జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకు ఉదాహరణ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఓ సంఘటన. భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. భార్యమీద కోపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త.. భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్వ గాయాలు కాగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన ఓ భార్యాభర్తలు శనివారం గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి భర్త.. భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. స్థానికులు గమనించి భార్యను కాపాడారు.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్


ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కాగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలిసి స్థానికులు.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Big Stories

×