E-Paper
Advertisement

యూట్యూబర్‌ని బోల్తా కొట్టించిన దొంగలు, బంగారం-డబ్బు దోచుకెళ్లారు? అదెలా సాధ్యం

యూట్యూబర్‌ని బోల్తా కొట్టించిన దొంగలు, బంగారం-డబ్బు దోచుకెళ్లారు? అదెలా సాధ్యం
Advertisement

Rachana Gurjar: గొప్పులకు వెళ్తే అసలకే ముప్పు వస్తుంది. పైన కనిపిస్తున్న యూట్యూబర్‌కు దొంగలు ఊహించని విధంగా షాకిచ్చారు. రాత్రికి రాత్రి ఆమె ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారు. సంచలనం రేపిన ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది? ఇంతకీ యూట్యూబర్ కథేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

యూట్యూబర్ బోల్తా కొట్టించిన దొంగలు

Advertisement

మధ్యప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ గురించి చెప్పనక్కర్లేదు. కాసింత పబ్లిసిటీ పిచ్చి ఉంది. ఆమె యూట్యూబ్ ద్వారా తనకున్న బంగారు ఆభరణాల వీడియోలను షేర్ చేశారు. ఆ ప్రదర్శన ఆమెకు లేనిపోని చిక్కులు తీసుకొచ్చింది. అసలే బంగారం మార్కెట్లో చాలా ధర ఉంది. అలాంటిది తనకు అన్ని నగలు ఉన్నాయని వీడియో చూపిస్తే దొంగలు ఊరుకుంటారా?

రచనా విషయంలో అదే చేశారు. ఆమె పెట్టిన వీడియోలను జాగ్రత్తగా గమనించిన దొంగలు, ఆమె ఇంటికి కన్నం వేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చొరబడిన దుండగులు.. లాకర్లను పగుల గొట్టి 6 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, దాదాపు రెండు లక్షల నగదును దోచుకెళ్లారు.

Advertisement

బంగారం-డబ్బు దోచుకెళ్లారు- షాకైన యూట్యూబర్

బంగారు ఆభరణాలు మాత్రమే కాదు ఇంట్లోని ఎనర్జీ డ్రింక్స్ ఎత్తుకెళ్లారు దొంగలు. తన ఇంట్లో జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రచన. రంగంలోకి దిగిన బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించి సోషల్ మీడియాలో పెట్టిన నగల వీడియోల ఆధారంగా దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

పరిస్థితి గమనించిన పోలీసులు, ప్రజలు ఎవరూ తమ ఇళ్లలోని నగదు, నగలు, ఖరీదైన వస్తువులను సోషల్ మీడియాలో ప్రదర్శించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు చేస్తే సైబర్ నేరగాళ్లు కాకుండా, స్థానిక దొంగలను ఆకర్షించి దొంగతనాలకు పాల్పడే అవకాశముందని గట్టిగానే హెచ్చరించారు.

ALSO READ: విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×