E-Paper
Advertisement

‘నాకు హేటర్స్ ఉన్నారా ఏంటి?’.. నెటిజన్ ప్రశ్నకు సామ్ క్రేజీ రిప్లై!

‘నాకు హేటర్స్ ఉన్నారా ఏంటి?’.. నెటిజన్ ప్రశ్నకు సామ్ క్రేజీ రిప్లై!
Advertisement

Samantha Q&A Session: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్న సమంత, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన క్యూ అండ్ ఏ (Q&A) సెషన్‌ నిర్వహించారు. ఈ సెషన్‌లో అభిమానులు అడిగిన పలు క్రేజీ ప్రశ్నలకు ఆమె అంతే ఓపికగా, చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు.

Read also-యూట్యూబర్ బోల్తా కొట్టించిన దొంగలు, బంగారం-డబ్బు దోచుకెళ్లారు? అదెలా సాధ్యం

Advertisement

నాకు హేటర్స్ ఉన్నారా ఏంటి?

ఈ చాట్ సెషన్‌లో ఒక నెటిజన్ సమంతను టార్గెట్ చేస్తూ.. “మిమ్మల్ని ద్వేషించే వారి గురించి మీరేమంటారు? ఒక్క ముక్కలో చెప్పండి” అని ప్రశ్నించారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు సెలబ్రిటీలు కాస్త అసహనానికి గురవుతుంటారు, లేదా దాటవేస్తుంటారు. కానీ సమంత మాత్రం ఎంతో కూల్‌గా, చిరునవ్వుతో రియాక్ట్ అయ్యారు. “హేటర్స్ ఆ? ఎవరి హేటర్స్? అసలు నాకు హేటర్స్ ఉన్నారా ఏంటి?” అంటూ చాలా అమాయకంగా, చమత్కారంగా బదులిచ్చారు. తనపై వచ్చే నెగిటివిటీని తాను అస్సలు పట్టించుకోనని, ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తానని చెప్పకనే చెప్పిన సామ్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

మొదటి ఛాయిస్ సాయి పల్లవి..

ఇదే సెషన్‌లో ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్‌ను సమంత బయటపెట్టారు. ఈ కథను మొదట నటి సాయి పల్లవి కోసం అనుకున్నారట. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయిందని, ఆ తర్వాతే ఈ కథ తన వద్దకు వచ్చిందని సమంత తెలిపారు. “నేను ఈ సినిమాను ఎంచుకోలేదు.. ఈ సినిమాయే నన్ను ఎంచుకుంది” అని సామ్ పేర్కొన్నారు. తాను ప్రాజెక్ట్‌లోకి వచ్చాక తన శైలికి తగినట్లుగా కథలో కొన్ని మార్పులు కూడా చేశారని చెప్పారు. అంతేకాదు, భవిష్యత్తులో సాయి పల్లవితో కలిసి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌లో ఒక సినిమా చేయాలని ఉందంటూ సమంత తన మనసులోని మాటను పంచుకున్నారు.

Read also-నోర్త్ గోవా Vs సౌత్ గోవా.. మీ నెక్స్ట్ ట్రిప్‌కి ఏది బెస్ట్? ఈ ఒక్క క్లారిటీ ఉంటే చాలు!

సినిమా విశేషాలు:
‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో సమంత ఒక సాధారణ గృహిణి (Housewife) పాత్రలో కనిపిస్తూనే, అవసరమైతే గన్‌ పట్టి ఫైట్ చేసే పవర్‌ఫుల్ ఉమెన్‌గా సరికొత్త యాక్షన్ లుక్‌లో అలరించనున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తడిమళ్ల, శ్రీముఖి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్‌పై, రాజ్ అండ్ డికె లతో కలిసి నిర్మించారు. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ డ్రామా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.

Related News

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

Big Stories

Advertisement
×