Minor Girl Harassed: మహిళలను దైవంగా కొలిచే దైవ భూమి. సృష్టికి మూలం స్త్రీ మూర్తి.. అనురాగం అప్యాయతలు పంచే ప్రేమామయి ఆమె. ఇవన్నీ మాటలకే సరిపోతున్నాయా? నిత్యం ఏదొక చోట కామాంధుల కీచక పర్వానికి బలైపోతున్నారు. మరిచిపోలేని గాధలు మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నటికి తీరని ఆత్మ ఘోషలు..తల్లి దండ్రులకు కడుపు కోతలు కన్నీళ్లను మాత్రమే మిగిలిస్తున్నాయా? కనికరమే లేకుండా మానవత్వమే కనుమరుగై అరాచకానికి గురవుతున్నారు మహిళలలు.. చిన్నపిల్లలు లేరు పెద్దవాళ్లు లేరు ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
మహిళలను దేవతగా కొలిచే దేశంలో ఎందుకు ఈ కీచక పర్వం.. దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే.. సభ్యసమాజం ఎటుపోతుందో అర్ధంకానీ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్న కూడా కొంత మంది మూర్ఖుల్లో మాత్రం చలనం లేదు. కొంత మంది చేసే అనర్ధాల వల్ల కుటుంబాలు ఆగం అవుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆవేశం రగిలిపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఏదో ఒక చోట క్రైమ్ కథ వింటూనే ఉన్నాం.. ఇలాంటివి విన్నప్పుడల్లా సమాజం ఎటు పోతుందో అర్ధం కావట్లేదు. ఇలాంటి దుర్ఘటనలు చూసిన ప్రతి కుటుంబం ఆడపిల్లలన్ని బయటకు పంపాలంటే జంకుతోంది. రోజులు గడుస్తున్నాయి. కొత్త ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కొత్తగా కఠిన రూల్స్ వస్తూనే ఉన్నాయి. అయినా కూడా పరిస్థితులు మారడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడ వద్దనే ఆలోచన మారడం లేదు. కదిలే బస్సులో, ప్రైవేటు బస్సులో , కదులుతున్న ట్రైన్‌లో నడిరోడ్డు మీద, నట్టింట్లో ఇలా కామాంధుల కీచకత్వానికి అన్నీ వేధికలే. గడిచిన వారం రోజుల్లోనే మూడు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి.
ఇటీవల ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరిగిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రత కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే.. అక్కడక్కడా దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో మహిళలపై వేధింపులు కొన్నిచోట్ల కామన్‌గా మారాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేసి వీడియోలను చిత్రీకరించారు. రక్సెల్ ఎక్స్‌ప్రెస్ లో కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతుండగా.. ఘటన జరిగినట్లు బాధితురాలి తండ్రి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: నాగర్ కర్నూల్‌లో దారుణం.. దైవదర్శానానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం
రాత్రి రెండు గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌కు వెళ్లగా లైంగిక వేధింపులు జరిగాయన్నారు. లైంగిక వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు యువతి చెప్పడంతో అతని ఫోన్ చెక్ చేశారు. ఫోన్‌లో వీడియోలను గుర్తించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు.