E-Paper
Advertisement

Rangareddy District: కరెంట్ తీగలపై పతంగి.. తీసే ప్రయత్నంలో బాలుడికి గాయాలు, ఇల్లు దగ్ధం

Rangareddy District: కరెంట్ తీగలపై పతంగి.. తీసే ప్రయత్నంలో బాలుడికి గాయాలు, ఇల్లు దగ్ధం
Advertisement

Rangareddy District: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రశాంతినగర్‌లో గణేష్ అనే బాలుడు తన ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకోవాలనే పని మీద ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ గాలిలో ఎగురుతూ వచ్చిన ఒక పతంగి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయింది. ఆ పతంగిని తీయాలనే ఉద్దేశంతో బాలుడు ఒక కర్రను ఉపయోగించి దానిని లాగేందుకు ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ, ఆ కర్ర ద్వారా హైటెన్షన్ విద్యుత్ బాలుడికి ప్రవహించడంతో అతను తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన గణేష్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

ఈ ప్రమాదం కేవలం బాలుడికే పరిమితం కాలేదు..  విద్యుత్ షాక్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే..  సమీపంలోని ఒక ఇంట్లో హై-వోల్టేజ్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని ఫ్యాన్లు ఊడి కింద పడిపోయాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి..  ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

ALSO READ: Srikakulam Road Accident:అయ్యో పాపం.. బైక్‌ను తప్పించబోయి కారును ఢీకొట్టిన లారీ.. కుటుంబం బలి!

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×