Prasanna-Dhivya Case: రిప్లింగ్ కో-ఫౌండర్, చెన్నై టెక్ బిలియనీర్ ప్రసన్న శంకర్-దివ్య దంపతుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ దంపతుల విడాకుల వ్యవహారం అమెరికా న్యాయస్థానంలో ఉంది. తాజాగా తన భర్త శంకర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది భార్య దివ్య. తన భర్త కామ పిశాచి అని ఆరోపణలు గుప్పించింది. దీనిపై ఆయన అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్టోరీలో అసలు కథ
2007లో ప్రసన్న శంకర్-దివ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌గా మారింది. చివరకు ప్రేమ, ఆపై పెళ్లికి దారి తీసింది. 2013లో ఇరువురు పెద్దల సాక్షిగా వివాహం చేసుకున్నారు. తొలుత ఈ దంపతుల మధ్య కాపురం సజావుగా సాగింది. కొడుకు పుట్టాడు.. అయినా విభేదాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఆ తర్వాత మనస్పర్థలు పెరిగి తారాస్థాయికి చేరాయి.
పరిస్థితి గమనించిన ఇరువురు అమెరికా న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ.9 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నది దివ్య ప్రధాన డిమాండ్. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇదిలావుండగా కొడుకుతో కలిసి దివ్య అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. గత వారం తన కొడుకును భర్త కిడ్నాప్ చేశారంటూ ఆమె చెన్నై సిటీలో ఫిర్యాదు చేశారు. ఆ మేటర్ విషయం కాసేపు పక్కనబెడదాం.
ఇంటర్వ్యూలో కొత్త విషయాలు
శాన్ ఫ్రాన్సిస్కోకి స్థానిక న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చింది దివ్య. అందులో తన భర్త ప్రసన్న శంకర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త కేవలం ఏకాంతం కోసమే అన్నట్లుగా చూసేవాడని వెల్లడించింది. తన కోరిక తీర్చకుంటే పరిణామాలు తీవ్రంగా ఉండాయని పలుమార్లు బెదిరించారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రసవ సమయంలో తన కోరిక తీర్చమని బలవంతం చేశాడని వివరించింది.
ALSO READ: భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన భార్య
తన రోజు వారీ కార్యకలాపాలు, చివరకు బాత్‌రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవారని గుర్తు చేసింది. దీనికితోడు వేశ్యలతో రిలేషన్ పెట్టుకునేవారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అలాగే అమెరికాలో పన్ను నుంచి తప్పించుకునేందుకు తనను, కొడుకుని మరో దేశానికి తరలించే ప్రయత్నం చేశారంటూ కొత్త విషయాలు బయటపెట్టింది.
అనూప్‌తో తనకున్న రిలేషన్ షిప్ గురించి ప్రసన్న అబద్దాలు చెప్పారని గుర్తు చేసింది. అది లైంగిక మైనది కాదని, భావోద్వేగమైనది మాత్రమేనని ఇంటర్వ్యూలో ప్రస్తావించారామె. తనపై శారీరకంగా దాడి చేశాడని ఆరోపించింది దివ్య. ఛాతీపై రెండుసార్లు కొట్టాడని వెల్లడించింది. ఆమెకు ఆర్థికంగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేశాడని వివరించింది.
రియాక్ట్ అయిన ప్రసన్న
శాన్ ఫ్రాన్సిస్కో న్యూస్ ఏజెన్సీ కథనంపై రియాక్ట్ అయ్యారు ప్రసన్న శంకర్. ఇద్దరం ఏడేళ్లు డేటింగ్ చేశామని, వివాహం జరిగి 10 ఏళ్లు అయ్యిందన్నారు. ఇన్నాళ్లు లేని ఆరోపణలు ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రసన్న-దివ్య వ్యవహారంపై న్యాయస్థానం ఇలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.