Meerut Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ మర్డర్ కేసులో అనూహ్య ట్విస్ట్ వచ్చింది. భర్తను హంత్య చేసి నందుకు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ కేడీ లేడీ గర్భవతి అని మెడికల్ రిపోర్ట్ లో తేలింది. దీంతో ఈ కేసు ఆసక్తికర మలుపుతిరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నగరానికి చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పూత్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అతని భార్య ముస్కాన్ రస్తోగి ప్రస్తుతం జైలులో ఉంది. జైలులో ఆమె గర్భవతి అని అధికారులు తెలిపారు. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆస్పత్రి నుండి ఒక వైద్య బృందం సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. ఈ కేసులో నిందితులైన ముస్కాన్, ఆమె సాహిల్ ప్రస్తుతం మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Also Read: మా కూతురే అల్లుడిని చంపింది.. నేవి ఆఫీసర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు
గత నెలలో మీరట్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ఉన్న సౌరభ్ రాజ్‌పూత్ (29) తన కుమార్తె పుట్టిన రోజు కోసం భారత్ వచ్చిన సమయంలో, అతడి భార్య ముస్కాన్ రస్తోగి (27), ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా (25) కలిసి దారుణంగా హత్య చేశారు. మార్చి 4న జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సౌరభ్‌ను కత్తితో పొడిచి, గొంతు కోసి హతమార్చారు. తర్వాత శవాన్ని 15 ముక్కలుగా చేసి డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో కప్పేశారు. హత్య తర్వాత ముస్కాన్, సాహిల్ కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లారు. బాధితుడు సౌరభ్ కనిపించడం పోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లుగా ముస్తాన్ తన అత్తమామతో గొడవ పడి మరో ఇంట్లో నివసిస్తోంది. సౌరభ్ వల్ల ముస్కాన్ కు ఒక కూతురు కూడా పుట్టింది. ఐదేళ్ల కుమార్తెతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. సౌరభ్ లండన్‌లో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ముస్కాన్, సాహిల్ మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. డ్రగ్స్‌కు బానిసైన ఇద్దరు సౌరభ్‌ను అడ్డు తొలగించుకోవడానికి ఈ దారుణానికి ఒడిగట్టారు.
ముస్కాన్, ఆమె భర్త సౌరభ్ చిన్ననాటి స్నేహితులు. అందుకే సౌరభ్ అమెని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కూతురు ఉంది. అయితే వివాహం తరువాత ముస్కాన్ స్కూల్ ఫ్రెండ్ సాహిల్ ఆమె జీవితంలోని ప్రవేశించాడు. ఆమెకు డ్రగ్స్ అలవాటు చేసి.. సౌరభ్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ అక్రమ సంబంధం కొనసాగించేవారు. ఈ విషయం సౌరభ్ తెలుసుకున్నాడు. విడాకులు ఇద్దామని ఆలోచించి.. ఆ తరువాత తన చిన్నారి కూతురు కోసం వెనుకడుగు వేశాడు. తన భార్యకు మరో అవకాశం ఇచ్చాడు. అదే అతను చేసిన తప్పుగా మారింది.
డ్రగ్స్ కు అలవాటు పడ్డ ముస్కాన్.. సౌరభ్ ఉద్యోగ రీత్యా లండన్ వెళ్లాక, మళ్లీ సాహిల్ పంచన చేరి.. అక్రమ సంబంధం, డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. అనూహ్యంగా సౌరభ్ లండన్ నుంచి తిరిగి రావడంతో వారికి అడ్డంకి ఉన్నాడని భావించి.. అతడిని నిద్రలోనే ఇద్దరూ కలిసి హత్య చేశారు.