E-Paper
Advertisement

Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా పడి స్పాట్‌లో ఏడుగురు

Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా పడి స్పాట్‌లో ఏడుగురు
Advertisement

Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. అయితే కొల్లూరు మండలం పరిధిలోని వేమూరు, దోనేపూడి-వెలగటూరు మధ్య ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కొబ్బరి బోండాలను తరలిస్తున్న ఓ ఆటో, మార్గమధ్యంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నక్కా ఆనందబాబు
క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే స్థానిక శాసనసభ్యులు నక్కా ఆనందబాబు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు.

Advertisement

కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే
మృతదేహాలను పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అలాగే, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశం
ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వెంటనే అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Also Read: విజయసాయిరెడ్డి.. పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా?

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×