E-Paper
Advertisement

OTT Movie : స్కూల్లో తుంటరి పిల్లలు చేసే తప్పుడు పనులు… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : స్కూల్లో తుంటరి పిల్లలు చేసే తప్పుడు పనులు…  కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : కామెడీ జానర్ లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు ఎవర్‌గ్రీన్ గా నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమానే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా హై స్కూల్ చివరిదశలో ఉన్న ముగ్గురు టీనేజ్ పిల్లల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు కాలేజ్ కి వెళ్ళే ముందే కన్యత్వాన్ని కోల్పోవాలని అనుకుంటారు. అయితే కథ మరోలా వెళ్తుంది. ఈ సినిమా ఒక రాత్రి జరిగే సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది. హాయిగా నవ్వుకోవాలనుకుంటే, ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

ఈ అమెరికన్ టీన్ కామెడీ సినిమా పేరు ‘Superbad’. డైరెక్టర్ గ్రెగ్ మోటోలా దీనిని తీశారు. ఇందులో జోనా హిల్, మైఖేల్ సెరా, క్రిస్టోఫర్ మింట్జ్-ప్లాస్సే, బిల్ హాడర్, సేథ్ రోగెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఐయండిబిలో 7.6/10తో ఎవర్‌గ్రీన్ కామెడీగా మిగిలిపోయింది. ఇది Hulu, Netflix, Prime Videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : ట్యాక్సీ డ్రైవర్‌తో కిలాడీ లేడీ… అడ్డమైన పనులన్నీ అతడితోనే… ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

సేథ్, ఫాగిల్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్ చదువుకూడా ముగింపు దశలో ఉంటుంది. ఇద్దరూ వేర్వేరు కాలేజీల్లో చేరాల్సి వస్తుంది. దీంతో వీళ్ళు విడిపోకముందే చివరిసారిగా ఒక పెద్ద పార్టీలో అమ్మాయిలతో శృంగార అనుభవాన్ని పొందాలని నిర్ణయించుకుంటారు. సేథ్ తన క్రష్ జూల్స్‌తో ఆ అనుభవం పొందాలని అనుకుంటాడు. ఫాగిల్ మాత్రం అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని ప్లాన్ చేస్తాడు. వారికి మరో స్నేహితుడు ఇవాన్ కూడా తోడవుతాడు. ఇక పార్టీకి వెళ్లడానికి, వాళ్ళు మద్యం కొనడానికి ప్రయత్నిస్తారు. అక్కడి నుంచి స్టోరీ ఊహించని కామెడీ మలుపులు తిరుగుతుంది.

Advertisement

ఫాగిల్ ఒక బార్ షాప్ లో మద్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ ఒక దొంగతనం కారణంగా పోలీసులు వస్తారు. ఈ సంఘటనతో ఫాగిల్ కి పోలీసులతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు ఫాగిల్‌ను అరెస్టు చేయకుండా, అతని అమాయకత్వం నచ్చి, తమతో కలిసి పార్టీలకు తీసుకువెళ్తారు. ఇది సినిమాలో కామెడీని ఒక రేంజ్ లో చూపిస్తుంది. ఇదిలా ఉండగా, సేథ్, ఇవాన్ తమ పార్టీ ప్లాన్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తూ అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. చివరికి వాళ్ళ కోరుకున్నట్టుగా మొదటి శృంగార అనుభవాన్ని పొందుతారా ? వీళ్ళ ప్రయాణం ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×