BigTV English

Tiger Attack: కొమురం భీం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. మరో వ్యక్తిపై పులి దాడి

Tiger Attack: కొమురం భీం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. మరో వ్యక్తిపై పులి దాడి

Tiger Attack: కొమురంభీం జిల్లాలో పెద్ద‌పులి సంచారం క‌ల‌కలం రేపుతోంది. ఎప్పుడు ఎవ‌రిపై దాడి జ‌రుగుతుందోన‌ని ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం కాగ‌జ్ న‌గ‌ర్ ప‌రిధిలో హైవే ప‌క్క‌నే క‌నిపించిన పులి ఇప్పుడు పొలాలు, చేల‌ల్లోకి వ‌చ్చి మ‌నుషుల‌పై పంజా విసురుతోంది. నిన్న ల‌క్ష్మి అనే 21 ఏళ్ల మహిళ‌పై పులి దాడి చేయ‌గా అక్క‌డికక్క‌డే మృతి చెందింది. దీంతో పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నారు.


ఓవైపు పులికోసం వెతుకులాట మొద‌లుపెడితే మ‌రోవైపు ఈ రోజు రైతుపై దాడి చేయడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రైతుకు తీవ్ర‌గాయాలు కావ‌డంతో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కంది చేనులో ప‌నిచేస్తుండ‌గా పులి దాడి చేసిన‌ట్టు తెలుస్తోంది. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. బ‌య‌ట‌కు రావాలంటేనే బ‌య‌ప‌డి పోతున్నారు. గ్రామాల్లో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలాల్లోకి, చేనుల్లోకి వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు డ‌బ్బు చాటింపు చేస్తున్నారు.

కాగ‌జ్ న‌గ‌ర్ మండ‌లంలోని ఈజ్గాం, విలేజ్ నంబ‌ర్ 1,3,5,8,9,10 గ్రామాల‌లో మ‌రియు క‌డంబా, ఆరెగూడ, గ‌న్నారం, సీతాగూడ గ్రామాల‌లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ గ్రామాలలో 144 సెక్ష‌న్ విధించారు. మ‌రోవైపు అట‌వీ అధికారులు డ్రోన్ స‌హాయంతో పులిని ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు. కానీ పులి మాత్రం త‌ప్పించుకుని తిరుగుతోంది.


ఇదిలా ఉంటే కాగ‌జ్ న‌గ‌ర్ అడ‌వుల్లోకి పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర నుండి పులులు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. గ‌డ్చిరోలి అడ‌వుల్లో నుండి జిల్లాలోకి పులులు రాగా క‌డంబా అడ‌విలో గ‌తంలో పులిపిల్ల‌లు చేసింది. అప్ప‌టి నుండి ఈ ప్రాంతంలో పులుల సంచారం పెరిగింది.

కాగ‌జ్ న‌గ‌ర్ తో పాటూ గ‌తంలో జిల్లాలోని దెహెగాం వ‌ద్ద కూడా ఓ యువ‌కుడిపై దాడి చేసి పులి చంపేసింది. వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం త‌గిన చ‌ర్య‌లు తీసుకుని పులుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌కుండా దాడులు జ‌రిగినప్పుడే స్పందిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శ‌లు వ‌స్తున్నాయి.

Related News

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Big Stories

×