Rangareddy News: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండల కనకమామిడి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెరుదుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అతి వేగం ప్రమాదకరమని పదేపదే పోలీసులు చెబుతున్నాయి. అయినా ఏ మాత్రం వాహనదారులు లెక్క చేయడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండల కనకమామిడి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఎదురెరుదుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
స్పాట్‌లో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గాయపడిన నలుగురిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో కారు ముందు పార్ట్ నుజ్జు నుజ్జు అయ్యింది. పోలీసులు వెళ్లి అందులోని వ్యక్తులను బయటకు తీశారు. అయితే వారంతా ఎక్కడివారు? ఎటువైపుకు వెళ్తున్నారు? అనేది తెలియాల్సివుంది.
ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్-బీజాపూర్ హైవే పై ఢీకొన్న రెండు కార్లు
ప్రమాదంలో ఒకరు స్పాట్ డెత్.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలు
ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు pic.twitter.com/0AEBB5z4Mj
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2025