Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న వారిలో నటరాజ్ మాస్టర్ ఒకరు. తాజాగా ఈయన బిగ్ టీవీలో ప్రసారమవుతున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటరాజు మాస్టర్ తన వృత్తిపరమైన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన కూతురి గురించి నటరాజ్ మాస్టర్(Nataraj Master) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నటరాజ్ మాస్టర్ మరొక కొరియోగ్రాఫర్ నీతు(Neethu)ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 7 ఏళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక పోతే ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించారు.
పాప కడుపులో ఉన్నప్పుడే తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లానని అందుకే తను నాకు లక్కీ అని భావిస్తాను అంటూ నటరాజ్ మాస్టర్ తెలిపారు. అయితే పెళ్లి తర్వాత మాకు పిల్లలు పుట్టకపోవడంతో చాలామంది మా గురించి ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు. అయితే మేము ముందుగా పిల్లలను ప్లాన్ చేసుకోలేదనీ , ఇప్పుడు పాప పుట్టిన తర్వాత ముందుగానే పిల్లల్ని ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది, పిల్లల్ని ప్లాన్ చేయకుండా ఉండి తప్పు చేసాం అనే భావన కలుగుతుందంటూ నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది నీతూ గురించి విమర్శలు కురిపించినట్లు తెలిపారు.
సాధారణంగా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అమ్మాయి శరీరాకృతిలో పూర్తిగా మార్పులు వస్తాయి ఈ నేపథ్యంలోనే నీతూ కూడా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అధిక శరీర బరువు పెరగడంతో తన పట్ల విమర్శలు వచ్చాయని అయితే వాటన్నింటిని లెక్క చేయకుండా ఆమె వర్క్ అవుట్ చేస్తూ ఇప్పుడు బాగుందని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇక మీ కూతురు గురించి ఏదైనా ఒక మాట దేవుని కోరుకోవాలి అంటే ఏం కోరుకుంటారు అంటూ వర్ష ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నటరాజ్ మాస్టర్ సమాధానం చెబుతున్న నా ఆయుషు కూడా తనే పోసుకొని చాలా కాలం పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అంటూ సమాధానం ఇచ్చారు.
తనకు పాప పుట్టిన తర్వాత తన ప్రపంచం మొత్తం మారిపోయిందని తెలియచేశారు. పాపను తీసుకొచ్చి నా చేతులలో పెట్టగానే అప్పటివరకు ఏడుస్తున్న మా అమ్మాయి నా వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏడుపు మానేసిందని ఆ క్షణమే నీకోసం నేను వచ్చాను నాన్న అనే భావన నాకు కలిగింది అంటూ తన కూతురు గురించి చెబుతూ తన పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. తన కూతురు వల్లే తనకు మరొక కొత్త జీవితం వచ్చిందని అప్పుడే తాను కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కొత్త జీవితాన్ని ప్రారంభించాను అంటూ నటరాజ్ మాస్టర్ తెలిపారు.
Also Read: అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్