Robbery in Warangal Rural | వరంగల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఎనుమాముల, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామాల్లో వరుసగా దొంగతనాలు చేశారు. వీరు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. కట్టర్లతో తాళాలు పగలగొట్టి మరీ దోపిడీకి దిగారు. సంక్రాంతి వేడుకల కోసం ఇంటి యజమానులు స్వగ్రామాలకు వెళ్లిన సమయంలోనే ఈ దోపిడీలు జరిగాయి. దుండగులు బంగారం, నగదును దోచుకెళ్లారు. వరుస చోరీలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పండగకు ముందు సూచనలు
పండగకు ముందే పోలీసులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. రాత్రిపూట గస్తీ పెంచినప్పటికీ దొంగలు మార్గం మార్చి అర్బన్ ప్రాంతంలో కాకుండా రూరల్ ప్రాంతాల్లో చోరీలు చేశారు. ఎనుమాముల మార్కెట్ పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో చోరీలు జరగడం ప్రజల్లో ఆందోళనను కలిగింస్తోంది.
Also Read: మహాకుంభమేళా వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి మృతి
చోరీలు జరిగాక ఫిర్యాదులు
దొంగతనం తర్వాత ఫిర్యాదు చేయడం, దర్యాప్తు జరగడం, దొంగలను పట్టుకోవడం చాలా సమయం పడుతుంది. దోపిడీకి గురైన సొమ్ము తిరిగి దొరకడం అనుమానాస్పదమే. ఈ నేపథ్యంలో, ఊరెళ్లే ప్రజలకు పోలీసులు 7 ముఖ్య సూచనలు చేశారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
దూరప్రాంతాలకు వెళుతున్నప్పుడు.. తాళాలు కనపడకుండా వేయాలి. గేట్‌కు లేదా మెయిన్ డోర్‌కి తాళాలు లోపలి నుంచి వేసి ఇతర డోర్లకు తాళం వేసుకోవాలి. కర్టెన్‌తో కవర్ చేయడం మంచిది.
ఇంటికి తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లడం కంటే.. సమీప బంధువులు లేదా మిత్రులను ఇంటి దగ్గర ఉండేలా చూడాలి.
విలువైన వస్తువులు, నగదు బీరువాలో కాకుండా బ్యాంక్ లాకర్‌లో భద్రపరచాలి.
రాత్రిపూట ఇంట్లో లైట్లు వెలిగేలా చూడాలి.
ఊరికి వెళ్లే ముందు పక్కవారికి లేదా పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలి. గస్తీ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచుతారు.
సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, నోటిఫికేషన్ వచ్చేలా చూడాలి. రోడ్డు కవరేజీ కోసం కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదులు కనిపిస్తే, వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలి.
ప్రజలందరూ ఈ సూచనలు పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
వరంగల్ లో దొంగల బీభత్సం..
ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలు
కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ దుండగులు
భారీగా నగదు, బంగారం చోరీ
సంక్రాంతి వేడుకలకు స్వగ్రామాలకు వెళ్లడంతో చోరీలు
ఘటనా స్థలానికి చేరుకుని విచారణ… pic.twitter.com/GomUXOP9PK
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025