E-Paper
Advertisement

Goa Murders: కాళ్లు, చేతులు కట్టేసి.. గొంతుకోసి, గోవాలో ఇద్దరు రష్యన్ మహిళలను చంపేసిన ఫ్రెండ్

Goa Murders: కాళ్లు, చేతులు కట్టేసి.. గొంతుకోసి, గోవాలో ఇద్దరు రష్యన్ మహిళలను చంపేసిన ఫ్రెండ్
Advertisement

గోవాలో దారుణం చోటుచేసుకుంది. ఓ రష్యన్ మహిళను ఆమె లివిన్ పార్టనర్ హత్య కిరాతకంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు అతడిని గాలించి పట్టుకున్నారు. అయితే నిందితుడి చెప్పిన మరో విషయం విని పోలీసులు షాకయ్యారు. అతడు మరో మహిళను కూడా హత్య చేశానని చెప్పాడు. అతడు చెప్పిన ప్లేస్‌కు వెళ్లి చూస్తే.. అక్కడ మరో శవం కనిపించింది. ఆమె కూడా రష్యన్ మహిళే. ఇద్దరి శవాలు వేర్వేరు ప్రాంతాల్లో కనిపించాయి. లివిన్ పార్టనర్ శవం అతడి ఇంట్లోనే లభించగా.. మరో మహిళ శవం గోవాలోనే మరో ప్రాంతంలో లభించింది.

అసలు ఏమైంది?

నిందితుడు అలేక్సీ లియనావ్ (37) గత 2024 నుంచి గోవాలోని ఆరంబాల్‌లోని ఓ అద్దె ఇంట్లో తన లివిన్ పార్టనర్ ఎలెన్ కస్తోనోవాతో కలిసి ఉంటున్నాడు. అయితే, ఏమైందో ఏమో.. అలేక్సీ ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. తర్వాతి రోజు ఆ ఇంటి యజమాని లోపలికి వెళ్లి చూడగా.. కస్తోనోవా రక్తపు మడుగులో పడి ఉంది. అలేక్సీ ఆమె కాళ్లు, చేతులను వెనక్కి కట్టేసి.. చిత్ర హింసలు పెట్టి గొంతు కోసేశాడు. కస్తోనోవా శవం కనిపించగానే ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అలేక్సీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆమెను బలవంతంగా ఇంట్లో నిర్భందించి ఉంటాడని, చివరికి హత్య చేసి తప్పించుకోడానికి ప్రయత్నించి ఉంటాడని తెలుస్తోంది.

మరో శవం లభ్యం

Advertisement

నిందితుడిని విచారించిన పోలీసులు అతడు మరో రష్యన్ మహిళను కూడా హత్య చేశాడని తెలుసుకుని షాకయ్యారు. అతడు ఇచ్చి సమాచారంతో గాలింపులు జరపగా.. మోర్జిమ్ ప్రాంతంలో మరో మహిళ శవం కనిపించింది. బాధితురాలిని ఎలెనా వనీవా (37)గా గుర్తించారు. పోలీసులు అతడు నుంచి హత్యలకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రెండు శవాలను పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితుడు అలేక్సీ లియనావ్ మీద సెక్షన్ 103, 126(2) కింద కేసులు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. అయితే, వారిద్దరి నిందితుడు ఎందుకు హత్య చేశాడో తెలియరాలేదు.

Also Read: మణికొండలో తప్పిన ప్రమాదం.. చెరువులో హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×