Amazon Republic Sale| అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో రూ.10000 కంటే తక్కువ ధరలో చాలా మంచి స్మార్ట్‌ఫోన్లు దొరుకుతున్నాయి. పెద్ద బ్యాటరీలు, మంచి కెమెరాలు ఉన్న ఫోన్లు చౌక ధరలో లభిస్తున్నాయి అమెజాన్ బ్యాంక్ డిస్కౌంట్లు, EMI సౌలభ్యం కూడా ఇస్తోంది. ముఖ్యంగా SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన వారికి 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్లతో చాలా డబ్బు ఆదా చేయవచ్చు.
ఈ సేల్‌లో iQOO Z10 Lite 5G ఫోన్ కేవలం రూ.9,998కు దొరుకుతోంది. దీని అసలు ధర రూ.12,999. అంటే సుమారు 23 శాతం తగ్గింపు ఉంది. ఈ ఫోన్‌లో 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. పెద్ద 6000mAh బ్యాటరీ ఉంది కాబట్టి రోజంతా బాగా ఉపయోగించవచ్చు. IP64 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ ఉంటుంది. బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కావాలనుకునేవారికి ఇది బాగా సరిపోతుంది.
శాంసంగ్ గెలాక్సీ M06 5G అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ.8,999 లభిస్తోంది. దీని అసలు ధర రూ.12,499జ అంటే 28 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్‌లో 50MP రియర్ కెమెరా ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. శాంసంగ్ బ్రాండ్ ఇష్టపడేవారు, మంచి కెమెరా కావాలనుకునేవారు ఈ ఫోన్‌ను ఎంచుకోవచ్చు.
పోకో C75 5G ఫోన్ సేల్‌లో రూ.8,299 అమెజాన్‌లో అమ్ముడవుతోంది. దీని లిస్టెడ్ ధర రూ.10,999. 5160mAh బ్యాటరీ ఉంది. 50MP మెయిన్ కెమెరా ఉండటం వల్ల ఫోటోలు బాగా వస్తాయి. 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
శాంసంగ్ గెలాక్సీ M07 అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ. 7,499 దొరుకుతోంది. అసలు ధర రూ.9,999. SBI కార్డ్ ఉపయోగిస్తే అదనపు డిస్కౌంట్ కూడా వస్తుంది. 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. IP54 ప్రొటెక్షన్ కూడా ఉంది. చాలా తక్కువ ధరలో శాంసంగ్ ఫోన్ కావాలంటే ఈ ఫోన్ బాగుంటుంది.
Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో టైప్ సి కేవలం ఛార్జింగ్ కోసం కాదు.. ఫోన్‌ని పవర్‌బ్యాంక్, పిసీగా మార్చే ట్రిక్స్
రియల్‌మి నార్జో 80 Lite 4G ఫోన్ రూ.7,899 సేల్‌లో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.8,999. ఇందులో భారీ 6300mAh బ్యాటరీ ఉంది. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ బాగా కావాలనుకునేవారికి ఇది చాలా మంచి ఫోన్.
పోకో C71 ఫోన్ రూ.7,999 దొరుకుతోంది. ఇందులో 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. 5200mAh బ్యాటరీ, 32MP రియర్ కెమెరా ఉన్నాయి. ఎక్కువ మెమరీ, మంచి పర్‌ఫామెన్స్ కావాలనుకునేవారు ఈ ఫోన్ తీసుకోవచ్చు.
ఈ సేల్‌లోని ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. త్వరగా చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేయండి!