Hyderabad Crime: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి తమ తమ ప్రాంతాలకు ప్రజలు క్యూ కట్టారు. ఇదే అదునుగా భావించిన దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. తెల్లవారుజామున 12 ఇళ్లపై పంజా విసిరారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మేడిపల్లిలోపంజా విసిరిన దొంగల ముఠా
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌వాసులు తమ తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీన్ని తమకు అనుకూలంగా మలచుకుంది దొంగల ముఠా. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటల గంటల సమయంలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు.
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 12 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలోని వీధులు, ఇళ్లకున్న సీసీటీవీలను పరిశీలించారు. ఎవరైతే ఊళ్లకు వెళ్లారో ఆయా ఇళ్లను ముందుగానే మార్కింగ్ చేసుకుంది రోబరీ గ్యాంగ్.
ఒక్క నైట్‌లో 12 ఇళ్లల్లో చోరీ, పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు
ముందుగా రెక్కీ నిర్వహించిన దొంగలు, ఆ తర్వాత కారులో కాలనీలోకి వచ్చారు. చేతిల్లో కత్తులు పట్టుకుని సంచరిస్తూ నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లారు. తొలుత తలుపులు బద్దలు కొట్టి ఇళ్ల లోపలకు వెళ్లారు. అల్మారాల లాక్స్‌ని పగులగొట్టి చోరీలకు పాల్పడింది. చాలా ఇళ్లలో బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు.
దొంగల ముఠా సభ్యులు భారీ స్థాయిలో వచ్చినట్టు తెలుస్తోంది. అరగంట లేదా గంట మధ్యలో ఆయా ఇళ్లలో దొంగతనాలు జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీటీవీలో కనిపించిన దృశ్యాల మేరకు వాళ్లంతా యువకులేనని అంటున్నారు. 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంటున్నారు. కొందరు తలకు మంకీ టోపీ పెట్టుకోగా, మరికొందరు మాస్క్‌లు ధరించారు.
ALSO READ: పరువు హత్య వెనుక ఏం జరిగింది.. కూతురు ప్రేమ వివాహం, షాకైన తండ్రి
ప్రాథమికంగా 30 తులాల బంగారం 8 కేజీల సిల్వర్ రెండు లక్షల నగదు చోరీకి గురైనట్టు నిర్ధారణకు వచ్చాం. ప్రాథమికంగా 30 తులాల బంగారం 8 కేజీల సిల్వర్ రెండు లక్షల నగదు చోరీకి గురైనట్టు నిర్ధారణకు వచ్చారు. ఇది అంచనా మాత్రమేని, చోరీకి గురైన సొత్తు ఇంకా పెరగొచ్చని అంటున్నారు. ఇప్పటికే దొంగతనంపై క్లూస్ టీమ్ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించింది. వితౌట్ వెపన్స్‌తో దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీలో ఎంత మంది పాల్గొన్నారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంక్రాంతి పండుగ వేళ దొంగల హల్చల్
మేడిపల్లిలోని చెంగిచెర్లలో వరుస చోరీలు
12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠా
చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో దొంగల సంచారం
మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ pic.twitter.com/QtpWlKnNKz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2026