E-Paper
Advertisement

డేటా సేఫ్టీ అలర్ట్..ఈ పర్మిషన్స్ ఇస్తే మీ ఫోన్ హ్యాక్ కావడం ఖాయం!

డేటా సేఫ్టీ అలర్ట్..ఈ పర్మిషన్స్ ఇస్తే మీ ఫోన్ హ్యాక్ కావడం ఖాయం!
Advertisement

Dangerous smartphone permissions to check: మనం స్మార్ట్‌ ఫోన్‌లో.. కొత్తగా ఏదైనా.. యాప్ ఇన్‌ స్టాల్ చేసినప్పుడు, అది ఓపెన్ చేయగానే.. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. కాంటాక్ట్స్, లొకేషన్, మైక్రో ఫోన్, కెమెరా ఇలా ఏది అడిగినా ఆలోచించకుండా ‘అలౌ’ కొట్టేస్తుంటాం. చాలా మంది యూజర్లు చేసే.. అతి పెద్ద పొరపాటు ఇదే. సైబర్ నేరగాళ్లు, మాల్‌ వేర్ యాప్‌లు మన ఫోన్‌లోని.. వ్యక్తిగత సమాచారాన్ని.. దొంగలించడానికి ఈ అనుమతినే.. ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే.. మీ ఫోన్‌లో ఏ అనుమతులు అత్యంత ప్రమాదకరమైనవో కచ్చితంగా తెలిసి ఉండాలి.

1. కెమెరా, మైక్రోఫోన్ :

ఇవి చాలా ముఖ్యమైన పర్మిషన్. ఫొటో లేదా వీడియో కాల్స్ యాప్‌లకు.. ఇది అవసరమే అయినప్పటికీ, ఫ్లాష్‌ లైట్ యాప్‌లు, ఫోటో.. ఎడిటర్లు లేదా కాలిక్యులేటర్లు కూడా కెమెరా లేదా మైక్ పర్మిషన్ అడుగుతుంటాయి. ఇవి బ్యాక్‌గ్రౌండ్ రన్ అవుతూ.. మీ మాటలు వినడానికి, రికార్డ్ చేయడానికి అవకాశం ఉంది. అత్యవసరం కాని ఏ యాప్‌కు కూడా కెమెరా లేదా మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వకండి.

2. లొకేషన్ యాక్సెస్ :

Advertisement

మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనే లైవ్ లొకేషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించే పర్మిషన్ ఇది. మ్యాప్స్ లేదా ఫుడ్ డెలివరీ యాప్‌లకు ఇది అవసరమే. కానీ సాధారణ గేమింగ్ యాప్స్ లేదా షాపింగ్ యాప్స్ కూడా లొకేషన్ పర్మిషన్ అడుగుతుంటాయి. దీని ద్వారా మీ ప్రైవసీ దెబ్బతింటుంది. ఎవరైనా మిమ్మల్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ‘Only while using the app’ ఆప్షన్‌ను ఎంచుకోవడం లేదా అవసరం లేని వాటికి లొకేషన్ ఆఫ్ చేయడం ముఖ్యం.

3. కాంటాక్ట్స్, స్టోరేజ్ యాక్సెస్ :

మీ ఫోన్‌లోని ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు , పర్సనల్ ఫైల్స్‌ను పూర్తిగా యాక్సెస్ చేసే పర్మిషన్ ఇది. లోన్ యాప్‌లు లేదా ఫేక్ యాప్‌లు ఎక్కువగా ఈ పర్మిషన్స్‌ని దుర్వినియోగం చేస్తుంటాయి. మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపడం, మీ పర్సనల్ ఫొటోలను సర్వర్‌కి అప్‌లోడ్ చేయడం వంటి మోసాలకు పాల్పడతాయి. కాబట్టి అనధికారిక యాప్‌లకు స్టోరేజ్ లేదా కాంటాక్ట్స్ పర్మిషన్ అసలు ఇవ్వకండి.

4. యాక్సెసిబిలిటీ పర్మిషన్:

Advertisement

స్మార్ట్‌ ఫోన్ సెక్యూరిటీలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైనది ఇదే. ఈ పర్మిషన్ ఇస్తే.. ఆ యాప్ మీ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూడటంతో పాటు, మీ ప్రమేయం లేకుండానే బటన్స్ క్లిక్ చేయడం, మెసేజ్‌లు చదవడం వంటి అన్నీ చేయగలదు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చేయడానికి సైబర్ కేటుగాళ్ళు ఈ యాక్సెసిబిలిటీ పర్మిషన్‌ను ఎక్కువగా వాడుతున్నారు. మీకు పూర్తిగా నమ్మకం లేని ఏ యాప్‌కి కూడా ఈ పర్మిషన్ ఇవ్వకండి.

Also Read: ల్యాప్ టాప్‌లో స్క్రీన్ షాట్ తీయడం ఎలా? ఈ 5 ఈజీ షార్ట్‌కట్స్ మీకు తెలుసా?

పర్మిషన్స్ ఎలా చెక్ చేయాలి?

మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Apps’ లేదా ‘Permission Manager’ ఓపెన్ చేయండి. అక్కడ ఏ యాప్‌కు ఏ పర్మిషన్స్ ఇచ్చారో క్లియర్‌గా కనిపిస్తుంది. మీకు అవసరం లేదనిపించిన లేదా అనుమానాస్పదంగా ఉన్న యాప్‌ల పర్మిషన్స్‌ను వెంటనే ‘Deny’ చేయండి లేదా ఆ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో.. సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ యాప్ పర్మిషన్స్‌ను చెక్ చేసుకుంటూ.. సేఫ్‌గా ఉండండి.

Related News

ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే.. ఈ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే!

యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ సీక్రెట్స్..వీడియో అప్‌లోడ్ చేసేముందు ఇవి తెలుసుకోండి!

ల్యాప్ టాప్‌లో స్క్రీన్ షాట్ తీయడం ఎలా? ఈ 5 ఈజీ షార్ట్‌కట్స్ మీకు తెలుసా?

రూ.1799కే 54 గంటల బ్యాటరీనా? మ్యూజిక్ లవర్స్‌ని ఊపేస్తున్న మోడల్!

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

Big Stories

Advertisement
×