Nandu World Scam:సోషల్ మీడియాలో ఇపుడు ఎక్కడ చూసిన నందు వరల్డ్ స్కామ్ గురించే.ఇక ఇదే సమయంలో ఆమె బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్‌గా వస్తుందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.దీంతో అసలు ఆమె బిగ్‌బాస్‌లోకి ఎలా వస్తారు? కేసు పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి.ఇక ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ బాషా నందు గురించి తన అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చాడు.
శేఖర్ బాషా మాట్లాడుతూ నందు వరల్డ్ స్కామ్ గురించి మనందరం చూశాము. ఆమె బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఇండియాకు వచ్చిందని, ఇక్కడ అరెస్ట్ అయ్యిందని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేల్చి చెప్పారు.బిగ్ బాస్ లోకి ఆమెని తీసుకోవాలని అనుకున్నారని,ఆమె ట్రాక్ రికార్డ్ చూసి వద్దనుకున్నారని తెలిపాడు.
అయితే విదేశాల్లో ఉన్న సెక్షన్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి.. అక్కడ కేసు అయితే అరెస్ట్ అయిపోతారు, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది అని చెబుతున్నారు. కానీ నిజంగా పరిస్థితి అంత సింపుల్‌గా ఉంటుందా?” అని శేఖర్ బాషా ప్రశ్నించారు.
“ఒక కేసు నమోదైందంటే వెంటనే ఆ వ్యక్తి దోషి అని చెప్పలేం. అదే సమయంలో కేసు ఉంది కదా అని లైట్‌గా కూడా తీసుకోకూడదు. అసలు అక్కడ ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? కోర్టులో ఏమైంది? బెయిల్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూడాలి” అని చెప్పుకొచ్చారు.
విదేశాల్లో కేసులు ఎలా ఉంటాయనే విషయంలో చాలామందికి సరైన అవగాహన లేదని శేఖర్ బాషా అన్నారు. “మన ఇండియన్ సిస్టమ్‌ని బేస్ చేసుకుని అక్కడి వ్యవస్థను అంచనా వేయకూడదు. ఒక్కసారి కేసు రిజిస్టర్ అయితే పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు, బ్యాంక్ లేదా వ్యక్తిగత వివరాలు.. దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇవ్వొచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చు. కానీ ప్రతి కేసుకీ ఒకే రూల్ ఉండదు” అని వివరించారు.
అదే సమయంలో నందు వరల్డ్ కేసులో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై కూడా ఆయన స్పందించారు.“యూట్యూబ్‌లో ఎవరో ఒకరు ఏదో చెప్పారు కాబట్టి అదే నిజం అనుకోవద్దు. లాయర్ మాట్లాడినా, యూట్యూబర్ మాట్లాడినా, మనం అసలు కోర్టు రికార్డులు ఏం చెబుతున్నాయో చూడాలి. ఎందుకంటే కేసులో అరెస్ట్, రిమాండ్, బెయిల్, ఛార్జ్‌షీట్.. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఇక బిగ్‌బాస్ ఎంట్రీ విషయానికి వస్తే.. “నందు బిగ్‌బాస్‌లోకి వస్తుందా? రాదా? అనేది ఇప్పుడే నేను చెప్పలేను. ఎందుకంటే ఒక వ్యక్తిపై లీగల్ ఇష్యూ ఉన్నప్పుడు బిగ్‌బాస్ లాంటి పెద్ద షో కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. షోకి కూడా రిస్క్ ఉండకూడదు కదా” అని శేఖర్ బాషా అభిప్రాయపడ్డారు.
“వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మామూలు విషయం కాదు. ఒక కంటెస్టెంట్ వస్తే ఆమె గురించి షోలో మాట్లాడతారు. బయట కూడా అదే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆమెపై కేసు విషయంలో క్లారిటీ లేకపోతే.. ఆ ఎపిసోడ్ మొత్తం దాని చుట్టూనే తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్‌బాస్ టీమ్ కూడా అన్ని విషయాలు చూసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
విదేశాల్లో కూడా ఫ్రాడ్ కేసులను చాలా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంటుందని శేఖర్ బాషా తెలిపారు. “మన దేశంలో కూడా ఫ్రాడ్ చేస్తే కేసులు ఉంటాయి. అలాగే ఇతర దేశాల్లో కూడా వాళ్ల చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయి. ఎక్కడైనా మోసం మోసమే. కానీ ఏ కేసులో ఏ శిక్ష పడుతుంది? అరెస్ట్ అవుతారా? బెయిల్ వస్తుందా? ఇవన్నీ కేసు వివరాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ముందుగానే తీర్పు చెప్పడం సరికాదు” అన్నారు.
అంతేకాదు.. “ఇలాంటి విషయాల్లో మనం ఎవరి మీదా పర్సనల్‌గా కామెంట్ చేయకూడదు. నందు తప్పు చేశారా లేదా అనేది కోర్టు, దర్యాప్తు ద్వారా తేలాల్సిన విషయం. కానీ కేసు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడటం మాత్రం తప్పు కాదు. ప్రజలకు కూడా అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది” అని శేఖర్ బాషా తెలిపారు.
ALSO READ:మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య స్పెషల్ రోల్ ? .. తెరపై తండ్రి-కొడుకుల మాస్ జాతర!
మొత్తానికి నందు వరల్డ్ కేసు విషయంలో సోషల్ మీడియాలో ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా.. అధికారికంగా పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనని శేఖర్ బాషా తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.!