Maharashtra Crime: మహారాష్ట్ర సతారాలో మైనర్ బాలికను ప్రేమించాలంటూ 18 యవకుడు కత్తితో బెదిరించాడు. కొంతకాలంగా తనను ప్రమించాలని బాలిక వెంట పడ్డాడు. బాలిక తిరస్కరించడంతో.. ఆమె స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో అడ్డుపడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. స్థానికులు చూసి చాకచక్యంగా స్పందించి యువకుడి నుంచి బాలికను కాపాడారు. అనంతరం అతన్ని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.
ఘటన వివరాలు:
సతారా జిల్లా పరిధిలోని ఓ పట్టణంలో ఓ 14 ఏళ్ల బాలికపై.. ఆ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. బాలిక అందుకు నిరాకరించడంతో.. ఆ యువకుడు ఈ తీరును జీర్ణించుకోలేకపోయాడు. కొద్ది రోజులుగా బాలికను వెంటాడుతూ, ఆమె ప్రయాణ మార్గాల్లో ఎదురుగా కనిపిస్తూ వేధిస్తున్నాడు.
కత్తితో బెదిరింపు:
ఒక రోజు మధ్యాహ్నం పాఠశాల ముగిశాక.. బాలిక తిరిగి ఇంటికి వెళ్తుండగా యువకుడు రోడ్డుపై ఆమెను అడ్డగించి, నన్ను ప్రేమించు లేదంటే నిన్ను చంపేస్తా అంటూ కత్తి చూపించి బెదిరించాడు.
స్థానికుల సమయస్ఫూర్తి:
అయితే అక్కడికి సమీపంగా ఉన్న కొంతమంది స్థానికులు.. చాకచక్యంగా స్పందించి బాలికను అతడి నుంచి విడిపించి భద్రత కల్పించారు. అనంతరం స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణ:
సూచనలతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారంలో బాలికకు పూర్తి రక్షణ కల్పించనున్నట్టు తెలిపారు.
పాఠశాలల వద్ద భద్రత పెంపు అవసరం:
ఈ ఘటన అనంతరం అక్కడి తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యాలు.. భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సమీపాల్లో పోలీసు బందోబస్తు పెంచాలని కోరుతున్నారు.
Also Read: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య, మృతదేహం ఇంట్లోనే పాతి, అక్కడి నుంచి..
ప్రేమ పేరుతో బాలికలపై ఒత్తిడి తేవడం, వారిని బెదిరించడం సమాజానికి ఓ ప్రమాదకర సంకేతం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు.. న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవడం, యువతలో మానసిక బలాన్ని పెంచడం, నైతిక విలువలపై అవగాహన కల్పించడం అనివార్యం.
మైనర్ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన యువకుడు..
మహారాష్ట్రలోని సతారాలో ఘటన
10వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు
బాలిక తనను తిరస్కరించడంతో మెడపై కత్తి పెట్టి బెదిరించిన యువకుడు
యువకుడి చెర నుంచి బాలికను చాకచక్యంగా రక్షించిన స్థానికులు
యువకుడికి… pic.twitter.com/Q4JI14A2jI
— BIG TV Breaking News (@bigtvtelugu) July 22, 2025