Mumbai Crime: డబ్బు కోసం అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను చంపేసింది. భర్తపై అభిమానంతో ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. సంచలన రేపిన ఈ ఘటనలో ఆసక్తికరమైన కొత్త విషయాలు వెలుగుచూశాయి. తూర్పు ముంబైలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దృష్టిపెట్టారు.
ముంబై సిటీలోని తూర్పు ప్రాంతం నలసోపారా. అక్కడ విజయ్ చౌహాన్-గుడియా దేవి దంపతులు ఉంటున్నారు. దశాబ్దం కిందట వీరికి వివాహం జరిగింది. ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఓం సాయి వెల్ఫేర్ సొసైటీలోని రషీద్ కాంపౌండ్‌లో నివశిస్తున్నాడు. వృత్తి రీత్యా రోజు వారీ కూలీ అయిన విజయ్, ఇన్యూరెన్స్ కట్టాడు.
అదే సమయంలో గుడియా దేవికి విశ్వకర్మతో పరిచయం కాస్త రిలేషన్ షిప్‌గా మారింది. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. సుమారు నెల కిందట విజయ్ చవాన్ బీమా పాలసీ గడువు ముగియడంతో దాదాపు 6 లక్షలు అందుకున్నాడు. వచ్చిన డబ్బుతో ఎక్కడైనా చిన్న ఇల్లు కొనాలని ప్లాన్ చేశాడు విజయ్. ఈ క్రమంలో కొంత డబ్బును భార్యకు బదిలీ చేశాడు.
ఏం జరిగిందో తెలీదుగానీ ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది. ఇంట్లోని నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టింది. ఇంటి పనుల నిమిత్తం విజయ్‌కు చాలామంది ఫోన్ చేస్తున్నారు. పని మీద బయటకు వెళ్లాడని చెప్పే ప్రయత్నం చేస్తోంది. విజయ్ సోదరుడు అఖిలేష్ కొత్త ఇల్లు కొన్నారు. ఇంటి చెల్లింపు కోసం డబ్బు అవసరమైంది.
ALSO READ: భారీ పేలుడు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
అఖిలేష్ కొన్నిరోజులుగా విజయ్‌ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఎప్పుడు కాల్ చేసినా అతడి భార్య సమాధానం ఇస్తోంది. తన గుట్టు బయటపడుతుందని భావించిన గుడియాదేవి, ప్రియుడితో కలిసి పారిపోయింది. భర్త మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతా నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్టు తేలింది.
సోమవారం అఖిలేష్.. తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. బయట తాళం వేసి ఉండడంతో కిటికీ లోపల చూశాడు. లోపల దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. కానీ ఎవరూ కనిపించలేదు. అయితే, నేలపై మూడు టైల్స్ వేరే కలర్‌తో కొత్తా కనిపించాయి.
అఖిలేష్‌కు అనుమానం వచ్చి ఆ ప్రాంతంలో తవ్వాలని పోలీసులను అభ్యర్థించాడు. నాలుగు అడుగుల లోతు తవ్వినప్పుడు మృతదేహం కనిపించింది. అది విజయ్ మృత దేహమని గుర్తించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించి మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.
10 రోజుల కిందట హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దేవి, ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
వారి పారిపోతుండగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. రోడ్డు పక్కనున్న కొన్ని సామాన్లు కొనుగోలు చేసినట్టు కనిపించింది. గుడియాదేవి పట్టబడితే అసలే ఏం జరిగిందో తెలుస్తుంది.