E-Paper
Advertisement

Sathya Sai Crime : శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త భర్త

Sathya Sai Crime : శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త భర్త
Advertisement

Sathya Sai Crime : శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడ్ని గొంతు నులిమి హత్య చేశారు. జిల్లాలోని ఎన్‌పీ కుంట మండలం గౌకనపేటలో ఆ దారుణం జరిగింది. హర్షవర్ధన్‌ (4) అనే బాలుడిని మేనత్త భర్త ప్రసాద్ హత్య చేశాడు. బుధవారం కిడ్నాప్ అయిన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురైనట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. నిందితుడు ప్రసాద్ కుమారుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, అతడి వైద్యానికి డబ్బులివ్వలేదని బావమరిదిపై ప్రసాద్ కక్ష పెంచుకున్నాడన్నారు. బుధవారం ఉదయం బావమరిది కుమారుడు హర్షవర్ధన్‌ను ప్రసాద్ కిడ్నాప్ చేశాడు. తమ కుమారుడు కనిపించడం లేదని గంగాధర్‌ దంపతులు నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఉదయం ఎన్‌పీ కుంట మండలం గౌకనపేటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నిన్న అదృశ్యమైన బాలుడు హత్యకు గురైనట్లు డీఎస్పీ శివనారాయణస్వామి నిర్ధరించారు.

డబ్బులు ఇవ్వలేదని

డబ్బులు ఇవ్వలేదని బావమరిది మీద కోపంతోనే అతడి కుమారుడిని హత్య చేసినట్లు ప్రసాద్ పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ఎన్పీ కుంట మండలం జౌకుల గ్రామం సమీపంలోని చెట్ల పొదల్లో పడేశాడు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అదృశ్యం కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. బావమరిది గంగాధర్ మీద ఉన్న కోపంతో హర్షవర్ధన్‌ను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

తన బాధే బావమరిది పడాలని

Advertisement

తన కుమారుడు జబ్బు చేస్తే బంధువులు పట్టించుకోలేదని ముఖ్యంగా బావమరిది గంగాధర్ పట్టించుకోకపోవడంతో ప్రసాద్ ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఆ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాను పడిన బాధే బావమరిది కూడా పడాలనే పగతోనే మేనల్లుడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసును మరింత విచారిస్తున్నామన్నారు. పెద్దలపై ఉన్న కోపాన్ని చిన్నపిల్లలపై చూపించడం ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Vikarabad Crime: వంట సరిగ్గా చేయట్లేదని భర్త వేధింపులు.. పెళ్లైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×