E-Paper
Advertisement

Vikarabad Crime: వంట సరిగ్గా చేయట్లేదని భర్త వేధింపులు.. పెళ్లైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య

Vikarabad Crime: వంట సరిగ్గా చేయట్లేదని భర్త వేధింపులు.. పెళ్లైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య
Advertisement

Vikarabad Crime: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వంట సరిగ్గా చేయడం లేదంటూ అత్తింటివారు, ముఖ్యంగా భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన నవవధువు శిరీష ఆత్మహత్య చేసుకుంది. పరిగి మండలం మల్లెమోనిగూడెంకు చెందిన శివలింగంతో ధరూర్ మండలం గడ్డమీదకి చెందిన శిరీషకు వివాహమైంది. వంట సరిగా రావడం లేదని, తనకంటే తక్కువ చదువుకుందని శివలింగం తరచూ శిరీషను వేధించేవాడు. భర్త వేధింపులతో విసిగిపోయి ఎదురుతిరగడంతో.. భార్యను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత ఫోన్‌లో ఆమెను దూషించడంతో శిరీష తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుంది. తమ కూతురి చావుకు అల్లుడే కారణమని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

ఎంతో ఆనందంగా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఆ జంట సంతోషం ఎంతో కాలం నిలవలేదు. నూతన బంధంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం వారి జీవితాలను తారుమారు చేసింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుబ్బాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్‌, ప్రణతి (24) లకు ఇటీవల వివాహమైంది.

Advertisement

ఉద్యోగ నిమిత్తం కొత్త జంట సిద్దిపేట నుంచి బైక్ పై హైదరాబాద్‌ బయలుదేరారు. పెద్ద చెప్యాల శివారులో అదుపు తప్పిన ట్రాక్టర్‌ అతి వేగంగా వచ్చి వీరి బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని 108 వాహనంలో గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో ప్రణతి మృతి చెందింది. సాయికుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొత్త జంట ప్రయాణం కన్నీటి వ్యథను మిగిల్చింది. దీంతో పెద్ద చెప్యాల గ్రామంలో విషాదం అలముకుంది.

Also Read: Vizag News: ఆర్థిక లావాదేవీలు చిచ్చు.. ఆగిన కూతురు పెళ్లి, తండ్రి ఆత్మహత్య

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×