Andhra King Taluka : అభిమానిగా రామ్ పోతినేని, హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. నేడు థియేటర్స్‌లోకి వచ్చేసింది ఆ మూవీ. సాగదీత సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయనే టాక్ వస్తుంది ప్రస్తుతానికి. అయితే సినిమాలో ఎమోషనల్ సీన్స్‌తో పాటు క్లైమాక్స్ బాగుందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఆంధ్ర కింగ్ అంటూ కన్నడ హీరోను ఈ సినిమాలోకి తీసుకోవడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. తెలుగు హీరోలనే ఆ పాత్ర కోసం తీసుకోవచ్చు కదా.. అని కొంత మంది అన్నారు.
అయితే, వస్తున్న సమాచారం ప్రకారం… ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో ఉపేంద్ర చేసిన సూర్య కుమార్ పాత్ర కోసం ఇద్దరు తెలుగు బడా హీరోలతో మేకర్స్ సంప్రదింపులు చేశారంట. ఆ ఇద్దరు హీరోలు ఎవరు.? వాళ్లు ఎలాంటి నిర్ణయం చెప్పారు..? అనేది ఇప్పుడు చూద్దాం.
ఆంధ్ర కింగ్ తాలూకా… ఓ అభిమాని బయోపిక్ అంటూ ప్రచారం చేశారు. సాగర్ అనే వీరాభిమాని.. తన హీరో సూర్య కోసం చేసిన త్యాగాలను ఈ సినిమాలో చూపించారు. సూర్య కుమార్ అనే హీరో… తన అభిమాని నుంచి ఇన్స్పైర్ అవ్వడాన్ని ఈ సినిమాలో చూపించారు.
అంత గొప్ప పాత్రలో.. అందులోనూ ఆంధ్ర కింగ్ అనే టైటిల్ పెట్టిన తర్వాత తెలుగు హీరో కాకుండా… కన్నడ హీరోను తీసుకోవడంపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలను మేకర్స్ తిప్పికొట్టారు. ఉపెంద్ర అంటే కన్నడకు మాత్రమే కాదు.. సౌత్ ఇండియా స్టార్ అని సమాధానం చెప్పారు మేకర్స్.
ఇలా చెప్తున్నారంటే.. వీళ్లు తెలుగు హీరోలను ఆ పాత్ర కోసం సంప్రదించలేరా… అంటే.. అందుతున్న సమాచారం ప్రకారం అయితే… సూర్య కుమార్ పాత్ర కోసం తెలుగులో ఇద్దరు బడా హీరోలను మేకర్స్ సంప్రదించారట.
ఆంధ్ర కింగ్ అంటే… తెలుగు హీరోలు అంటే.. ముందుగా కింగ్ నాగార్జుననే గుర్తుకు వస్తాడు. కింగ్ అనే పేరు మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు… మన భారతీయ సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకు మాత్రమే ఉంది. అందుకే ముందుగా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ మేకర్స్.. కింగ్ నాగార్జునను ఆ సూర్య కుమార్ పాత్ర కోసం సంప్రదించారంట. అయితే, కథ విన్న తర్వాత నాగార్జున తిరస్కరించినట్టు తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో.. నాగార్జున హీరోగా కాకుండా సపొర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన 100వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. అందువల్లే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ పిల్లర్స్ అని చెప్పుకుంటే… చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు ముందు చెబుతారు. వరుస విజయాలు రావడం వల్ల విక్టరీ అనే ట్యాగ్‌ను ఇచ్చారు. అలాంటి హీరో అయితే… సూర్య కుమార్ పాత్రకు సరిగ్గా సెట్ అవుతుందని అనుకున్నారేమో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ మేకర్స్.
నాగార్జున రిజెక్ట్ చేసిన తర్వాత విక్టరీ వెంకటేష్ దగ్గరకు వచ్చారంట. అయితే వెంకీ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఫర్ఫెక్ట్ రిజన్ తెలియకపోయినా.. వెంకీ మాత్రం ఈ మూవీని తిరస్కరించినట్టు అయితే సమాచారం.
నాగార్జున, వెంకటేష్ తర్వాత… నందమూరి బాలకృష్ణను కూడా మేకర్స్ సంప్రదించారు అనే మాటలు వినిపించాయి. కానీ, పూర్తి వివరాలు అయితే తెలిసి రాలేదు.
తెలుగులో ఈ ఇద్దరు హీరోలు రిజక్ట్ చేయడంతో… నిర్మాతలు పరభాష హీరో అయితే కరెక్ట్ అని అనుకుని… కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను టచ్ చేశారంట. ఉపేంద్ర… పేరుకు కన్నడ హీరో అయినా.. ఆయన గతంలో సౌత్ ఇండియా స్టార్ అని చెప్పుకొవచ్చు. ఆయన నటించిన ఉపేంద్ర, రా, రక్త కన్నీరు లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ హిట్ అయ్యాయి.
అందుకే ఉపేంద్రకు ఈ మూవీ స్టోరీని వినిపించారంట. ఉపేంద్ర కూడా ఒప్పుకున్నాడంట. అలా… ఉపేంద్ర ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి ఫైనల్ అయ్యారంట.