Kerala Gang Rape Case: కేరళలో మరోసారి హృదయ విదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేరళ కాసర్ గోడు లో ఓ 16 సంవత్సరాల బాలుడు పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనను ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.
ఎలా బయటపడింది ఈ దారుణం?
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆ బాలుడు, గే డేటింగ్ యాప్ ద్వారా పలు వ్యక్తులతో పరిచయం అయ్యాడు. ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని.. 14 మంది వ్యక్తులు అతనిపై రెండు సంవత్సరాలపాటు లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల బాలుడు ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి, అతన్ని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వివరాలు
ఈ కేసులో అరెస్టైన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్‌బాల్ కోచ్, కొంతమంది వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు జైలులో పెట్టారు. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది.
కేసు నమోదు
ఈ సంఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరగడం వల్ల కఠినమైన శిక్షలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా, నిందితులు ఉపయోగించిన గే డేటింగ్ యాప్, వారి చాట్స్, మొబైల్ ఫోన్లు అన్నింటినీ ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు.
సమాజంపై ప్రభావం
సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా అమ్మాయిలపై జరుగుతున్నాయని వింటాం. కానీ ఇక్కడ ఒక మైనర్ బాలుడిపై ఇంతమంది కలిసి దారుణానికి పాల్పడటం షాకింగ్‌గా ఉంది. సోషల్ మీడియా, మొబైల్ యాప్‌ల ద్వారా పిల్లలు ఎవరితో మమేకం అవుతున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించకపోతే.. ఇలాంటి ఘటనలు జరగవచ్చు. ఈ కేసు తర్వాత కేరళలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రాజకీయంగా హాట్ టాపిక్
ఈ సంఘటనలో రాజకీయ నాయకుల పేర్లు బయటకు రావడంతో.. కేరళ రాజకీయాల్లో కూడా చర్చలు ముదురుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించకపోతే.. చట్టంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
సమాజానికి పాఠం
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఇంటర్నెట్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో కలుస్తున్నారు అనే విషయాల్లో జాగ్రత్తలు అవసరం.
Also Read: తిరుపతి మృతదేహాల కేసు.. మృతులు తమిళనాడు వాసులు, కాకపోతే
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదంటే.. నిందితులకు వెంటనే కఠిన శిక్షలు విధించాలి.