BigTV English

Youtuber Madhumita: మధుమిత చివరిగా ఏం చెప్పిందంటే? ఫోన్‌లో కీలక ఆధారాలు!

Youtuber Madhumita: మధుమిత చివరిగా ఏం చెప్పిందంటే? ఫోన్‌లో కీలక ఆధారాలు!

Youtuber Madhumita Incident: ఎన్టీఆర్ జిల్లాలో అనుమానాస్పదంగా మృతిచెందిన యూట్యూబర్ మధుమిత.. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. 64 గంటలుగా ఆమె మృతదేహం మార్చురీలోనే ఉంది. ఈ క్రమంలో తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని బంధువులు చెబుతున్నారు. మధుమిత ఫ్లెక్సీలతో హాస్పిటల్‌ నుంచి పీఎస్‌ వరకు ర్యాలీ తీశారు. న్యాయం కోసం నిన్న తిరువూరు పీఎస్‌ వద్ద బంధువుల ఆందోళనకు దిగారు.


ఎన్టీఆర్ జిల్లా ఎ కొండూరుకి చెందిన మధుమిత.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ .. ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ లక్షల ఫాలోవర్స్‌తో ఫేమస్ అయ్యింది. యూట్యూబర్‌గా రీల్స్‌ చేసే అలవాటున్న మధుమితకు విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన.. బొల్లిపోగు ప్రతాప్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ప్రతాప్‌ తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఐదేళ్లుగా తమ కూతురితో ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రతామ్ తమ కూతురును ఇంటి నుండి బయటికి తీసుకువెళ్లి.. చంపి ఉరి వేసినట్టుగా ఆరోపిస్తున్నారు మధుమిత తల్లిదండ్రులు. కొన్ని రోజులుగా మధుమిత, ప్రతాప్ సన్నిహితంగా ఉంటున్నారని, దానిపై పలుమార్లు ఆమెను హెచ్చరించినట్లు తెలిపారు. ప్రతాప్ కుటుంబ సభ్యులే మధుమితను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతాప్ సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


మధుమిత మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరితో చాటింగ్ చేసింది? ప్రతాప్‌తో ఉన్న సంబంధం ఏంటని ఆరా తీస్తున్నారు. ఫోన్‌లో ఉన్నా డేటాను రెట్రీ చేస్తున్నారు. ఆమె ఫోన్‌లో ఓ సెల్ఫీ వీడియోను గుర్తంచారు పోలీసులు. అందులో వాళ్ల అమ్మ తిట్టిన విషయాలు, మరోవైపు తాను తప్పు చేస్తున్నాను అని చెప్పిన విషయాలన్ని ఆ వీడియోలో ఉన్నాయి. వీటన్నిటిని పోలీసులు గోప్యంగా ఉంచుతూ.. ఇంట్రన‌ల్‌గా కొంత ఇన్పర్‌మేషన్ సేకరిస్తున్నారు. మధుమిత మనస్తాపానికి గురై చనిపోయిందా లేకపోతే వీళ్లే చంపేశారా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ మధుమిత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశం ఉదని పోలీసులు తెలిపారు.

Also Read: పెళ్లిలో కాల్పులు.. కూతురు ఆ తప్పు చేసిందని కాల్చి చంపిన ఆర్మీ ఆఫీసర్..

సోషల్ మీడియా మంచికా? చెడుకా? చెత్త వీడియోలు ముంచెత్తుతున్నాయని.. వాటిని చూస్తే చెడిపోతారని ఒకవైపు అలర్ట్స్ వినిపిస్తున్నాయి. ఆ వీడియోలు చేస్తున్నవాళ్లు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యూస్ రాలేదని ఒకరు.. తనను ట్రోల్ చేస్తున్నారంటూ మరొకరు.. డిప్రెషన్‌కు సైతం గురవుతున్నారు. ఉత్తరాదిలో తనకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారంటూ ఓ యువతి నిండు ప్రాణం బలితీసుకుంది. తెలుగమ్మాయి సింగర్ జాను తాను సూసైడ్ చేసుకునే పరిస్థితి కల్పించారంటూ కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు యూట్యూబర్ మధుమిత సూసైడ్ చేసుకుందా లేక హత్య చేశారా? ఈ మూడు ఘటనలు ఎన్నో ప్రశ్నల్ని తెరపైకి తెస్తున్నాయి.

Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×