Ayushman Card: మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్. దీనికి ధీటుగా ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఆయుష్మాన్ వయ వందన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? కేంద్ర- రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం అధికారంలోకి ఉంది. అలాంటప్పుడు అదే పేరు మీద ఎందుకు పెట్టారు? అసలు స్టోరీ ఏంటి?
ఆయుష్మాన్ భారత్ వర్సెస్ ఆయుష్మాన్ వయ వందన
తొలుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ వయ వందన పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది ఢిల్లీ ప్రభుత్వం. దీని ప్రకారం.. కేవలం ఢిల్లీలోని 36 లక్షల మంది ప్రజలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ రానుంది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ఢిల్లీ ప్రభుత్వం అదనంగా మరో రూ.5 లక్షలు జత చేస్తుంది. ఈ పథకం గతనెల ఢిల్లీలో ప్రారంభమైంది. ఇంతకీ ఆయుష్మాన్ కార్డులు స్టోరీ ఏంటి?
ఆయుష్మాన్ కార్డ్ లక్ష్యం ఏంటి? ఆయుష్మాన్ కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే ఆరోగ్య గుర్తింపు కార్డు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రులలో దీనిద్వారా లబ్ధిదారులు ఉచిత చికిత్సను పొందవచ్చు. 70 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం ఈ స్కీమ్‌ను అందుకోవచ్చు. ఆదాయంతో సంబంధం లేకుండా ఈ సేవలు పొందవచ్చు. రూ.5 లక్షల ఉచిత లబ్ది చేకూరనుంది.
ఆసుప్రతిలో చేరక ముందు 3 రోజులు, డిశ్ఛార్జి అయిన తర్వాత రెండువారాల వరకు అయ్యే ఖర్చులు ఈ స్కీమ్ కింద కవర్ అవుతాయి. దేశ వ్యాప్తంగా పేద కుటుంబాలు ఆయుష్మాన్ కార్డ్ పొందవచ్చు. ముఖ్యంగా వారిలో గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, భద్రతా సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పొందగలరు. దీనికితోడు అంత్యోదయ అన్న యోజన-AAY రేషన్ కార్డ్ హోల్డర్లకు తొలి ప్రాధాన్యం ఉండనుంది.
ALSO READ: పహల్గాం దాడి ప్లాన్ లష్కరే పనే, ఎన్ఐఏ రిపోర్టులో సంచలన నిజాలు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆయుష్మాన్ కార్డును పొందేందుకు pmjay.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఏపీ లేదా తెలంగాణ రాష్ట్రం పేరు ఎంచుకోవాలి. అర్హతలు అన్నీ ఫుల్ చేసుకుని అప్లై బటన్‌పై క్లిక్ చెయ్యాలి. మీ పేరు, వయసు, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి. ఆ తర్వాత కొన్ని వారాల్లో ఆయుష్మాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. వెబ్ పోర్టల్ కాకుండా ఆయుష్మాన్ భారత్ మొబైల్ యాప్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఒకే కుటుంబం నుండి ఎంత మంది ఆయుష్మాన్ కార్డు స్కీమ్ ఎంచుకోవచ్చు. ఈ పథకంలో అలాంటి పరిమితి నిర్ణయించబడలేదు. ఒక కుటుంబంలో ఎంత మంది సభ్యులైనా ఆయుష్మాన్ కార్డు స్కీమ్‌లో చేరవచ్చు. దీని ప్రయోజనాలు పొందవచ్చు. అందుకోసం కుటుంబంలోని సభ్యులంతా ఈ పథకానికి ఉపయోగించుకోవచ్చు. కేంద్రప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చే ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఢిల్లీ ప్రభుత్వం ఆయుష్మాన్ వయ వందన పథకం 10 లక్షలు కాగా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఐదు లక్షలు మాత్రమే