Mokshagna : నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీకి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని నందమూరి సైన్యమంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఓపెనింగ్ ఈరోజు జరగాల్సి ఉంది. కానీ ముందుగా ప్లాన్ చేసినట్టుగా ఈరోజు సినిమా ఓపెనింగ్ జరగట్లేదనే బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలయ్యతో పాటు హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇలా పలువురు స్టార్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ప్రత్యేకంగా బాలయ్య దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైంలో ఆయనతోపాటు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పలువురు స్టార్ హీరోల వారసులు ఆల్రెడీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టేశారు. దీంతో నందమూరి వారసుడైన మోక్షజ్ఞ (Mokshagna) సినిమా ఎంట్రీ ఎప్పుడు ? అని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఒకానొక టైంలో అసలు మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తి లేదు అనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ రీసెంట్ గా మోక్షజ్ఞ టాలీవుడ్లోకి అడుగుపెట్టే టైం ఎట్టకేలకు వచ్చేసింది అని ప్రకటించారు.
‘హనుమాన్’ (Hanuman) మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను అప్పజెప్పారు బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్లో ఇతిహాసాల స్ఫూర్తితో, సోసియో ఫాంటసీ కంటెంట్ తో “సింబా” అనే మూవీ రాబోతుందని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో భాగం అని వెల్లడించారు కూడా. పైగా మోక్షజ్ఞ బర్త్ డేకి అఫిషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, ఆ తరువాత మోక్షజ్ఞ మరో న్యూ లుక్ వదిలారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఓపెనింగ్ కు డిసెంబర్ 5న ముహూర్తం పెట్టారు. దీంతో డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుందా అని ఇన్నాళ్లు ఈగర్ గా వెయిట్ చేశారు నందమూరి అభిమానులు. కానీ వాళ్ళ ఎదురుచూపులకు ఫలితం లేకుండా పోయింది.
ఈరోజు జరగాల్సిన నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఓపెనింగ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం పుష్ప ఫీవర్ అని అంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప రాజ్ మేనియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ పెట్టుకున్నా, ప్రేక్షకుల దృష్టి మాత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) పైనే ఉంటుంది. దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి ఈ మూవీ ఓపెనింగ్ ని వాయిదా వేశారని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే మరి మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రానున్న ఈ మూవీ ఓపెనింగ్ కు ముహూర్తం నెక్స్ట్ ఏ రోజున పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369) కి సీక్వెల్ రాబోతోందని, ‘ఆదిత్య 999’ పేరుతో రానున్న ఈ సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడని తాజాగా బాలయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మొదటి మూవీ లాంచ్ కే అడ్డంకులు ఎదురవుతున్నాయి అనేది బ్యాడ్ న్యూస్. మరోవైపు మోక్షజ్ఞ సెకండ్ సినిమా పనులు కూడా జరుగుతున్నాయి అనే విషయం మాత్రం నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.