Hardik Pandya Watch: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో ( ICC Champions Trophy 2025) భాగంగా… ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా ( Team India ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. సమీప ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును… దుబాయ్ వేదికగా చిత్తు చేసిన టీమిండియా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో రెండవ విజయాన్ని వరుసగా నమోదు చేసుకుంది. అంతేకాదు ఈ టోర్నమెంట్లో సెమిస్ కు వెళ్లేందుకు కూడా మార్గం సుగమం చేసుకుంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో…. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
ఈ మ్యాచ్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya Watch )… ఒకరిదైనా వాచ్ పెట్టుకొని మ్యాచ్ ఆడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. దీంతో హార్దిక్ పాండ్యా పెట్టుకున్న ఆ స్మార్ట్ వాచ్ ధర ఎంత ఉంటుంది? ఏ బ్రాండ్ అంటూ చాలామంది ఆరా తీస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ ధర ఏకంగా ఏడు కోట్లు ఉంటుందట. రిచర్డ్ మిల్లె కంపెనీ ( Richard Mille watch ).. ఈ వాచ్ తయారు చేసింది. హార్థిక్ పాండ్యా ధరించిన వాచ్… ప్రపంచంలోనే అత్యధిక ధర ఉన్న వాచుగా ప్రాచుర్యం పొందిందట. ఈ గడియారం కూడా తనకు ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంటే… టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్ ధరించిన ఏడు కోట్ల గడియారం గురించి అందరూ సెర్చ్ చేశారు. దీంతో హార్దిక్ పాండ్యా ఇప్పుడు.. సోషల్ మీడియాలో ట్రైనింగ్ కూడా అవుతున్నాడు.
Also Read: IND VS PAK: పాకిస్తాన్ తో మ్యాచ్… మిస్టరీ ప్లేయర్ తో బరిలోకి టీమిండియా.. జట్ల వివరాలు ఇవే!
ఇది ఇలా ఉండగా నేను ఆదివారం జరిగిన టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ( Team India vs Pakistan )
… 6 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది టీమిండియా. విరాట్ కోహ్లీ సెంచరీ, గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ విజయంతో… పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ లోకి వచ్చింది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… గ్రూప్ ఎ లో టీమిండియా ఉంది. ఇందులో నాలుగు జట్లు ఉండగా… టీమిండియానే రెండు మ్యాచ్ లు గెలిచి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది. ఇక పాకిస్తాన్ రెండు మ్యాచ్ లలో ఓడిపోవడంతో… పాయింట్స్ టేబుల్ లో కింది స్థాయికి పడిపోయింది.
𝑩𝒊𝒈 𝒎𝒂𝒕𝒄𝒉, 𝒃𝒊𝒈 𝒃𝒍𝒊𝒏𝒈! ⌚
Hardik Pandya was seen wearing a ₹7 crore Richard Mille watch during the epic India vs Pakistan battle 😍💸#PAKvIND #Dubai #HardikPandya #Sportskeeda pic.twitter.com/y3yKFE0Dai
— Sportskeeda (@Sportskeeda) February 23, 2025