E-Paper
Advertisement

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు!

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు!
Advertisement

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కబల్లాపుర జిల్లా బాగేపల్లి సమీపంలోని సుంకాలమ్మ దేవాలయం వద్ద వరుసగా వాహనాలు ఢీకొన్న ఈ విషాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

రహదారిపై ముందు వెళ్తున్న ఒక ఆటోను, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఊపుతో నియంత్రణ కోల్పోయిన ఆటో.. ఒక్కసారిగా ముందున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. కారు, లారీ మధ్య నలిగిపోవడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది.

Advertisement

ఈ ప్రమాద తీవ్రతకు ఆటో డ్రైవర్ అంజినప్ప (33)తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఉమాదేవి (55), విజయమ్మ (40), లక్ష్మమ్మ (50), సరోజనమ్మ (43) అక్కడికక్కడే కన్నుమూశారు. మిగిలిన వాహనాల్లో ఉన్న మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే చిక్కబల్లాపుర ఎస్పీ కుశాల్ చౌక్సే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లారు.. ఇంతలోనే ఊహించని ఘోరం!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×