BigTV English

ACTOR ARREST: నటి సోను అడ్డంగా దొరికిపోయింది, వెనుక ఏం జరిగింది?

ACTOR ARREST: నటి సోను అడ్డంగా దొరికిపోయింది, వెనుక ఏం జరిగింది?
Socialmedia influencer biggboss fame actor Sonugowda arrested
Socialmedia influencer biggboss fame actor Sonugowda arrested

ACTOR ARREST: ఆధునిక కాలంలో యువత అంతా సోషల్ మీడియా చుట్టే తిరుగుతోంది. రాజకీయ నేతల నుంచి కంపెనీల వరకు అందరూ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారనే సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ ఫ్యూయెన్సర్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అదే విధంగా వివాదాలు కూడా వాళ్లని వెంటాడుతున్నాయి. ఈ కోవలోకి చెందినది నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, బిగ్ బాస్ ఫేం సోను శ్రీనివాసగౌడ.


తాను ఏం చేసినా పర్వాలేదనుకుంది. రూల్స్ ని ఉల్లఘంచి అడ్డంగా బుక్కైంది. ఈమెని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. రాయ్ చూర్ కు చెందిన ఎనిమిది బాలికను దత్తత తీసుకుంది నటి సోను గౌడ. బాలికకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ యవ్వారంలో ఆమె అడ్డంగా దొరికిపోయింది. దత్తత నిబంధనల ప్రకారం ఎవరిని.. ఎక్కడి నుంచి దత్తత తీసుకుంటారో వాటికి సంబంధించిన ఎలాంటి వివరాలు బహిర్గతం చేయరాదు. కానీ, వాటిని అధిగమించింది సోను.

ముఖ్యంగా ఇంట్లో బాలికకు ముక్కు కుట్టించడం, భోజనం పెట్టిన వీడియోలను షూట్ చేసింది. వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. దీనిపై పలురకాలుగా ట్రోల్స్ వచ్చాయి. వీడియోస్ కింద వెరైటీగా క్యాప్షన్ వుండేవి. కొన్నిసార్లు బాలికను దత్తత తీసుకున్నానని, మరి కొన్నిసార్లు దత్తత తీసుకోవాలని ఉందంటూ రకరకాలుగా పోస్టులు పెట్టేది. వీటిపై దృష్టి పెటారు నెటిజన్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు.


సోను వ్యవహారశైలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు. దీంతో సోనును అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆమె వ్యవహారశైలిపై దర్యాప్తు జరుగుతోందని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. మరోవైపు గతంలో సోనూగౌడ మాల్దీవులకు వెళ్లినప్పుడు బికినీ ధరించి షూట్ చేసిన వీడియోలు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఆమె ఫాలోవర్స్ అమాంతంగా రెట్టింపు అయ్యారు. పాపులర్ అవుతున్న సమయంలో బ్యాడర్ హళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Related News

AP Student Murder: తుపాకీతో కాల్చి.. ఢిల్లీలో చిలకలూరిపేట యువకుడు మృతి

Hyderabad News: డేటింగ్ యాప్ ఉచ్చులో ఆ డాక్టర్‌.. 25 లక్షలు-15 తులాల బంగారం, మేటరేంటి?

Eluru News: ఆడిటర్ అంటూ ఆట ఆడేశాడు.. 2 కిలోల బంగారంతో పరార్, ఫైనాన్స్ కంపెనీలో మోసం

Uttar Pradesh News: మాట్లాడలేదని రగిలిపోయిన యువకుడు.. స్కూటీపై వెళ్తున్న మహిళకు నిప్పు, ఆ తర్వాత

Hyderabad News: హైదరాబాద్‌లో భారీగా పాత నోట్లు.. దాదాపు రెండు కోట్లు సీజ్, లెక్కల్లో తేడాలు

Mancherial Incident: నువ్వు లేక నేను లేను.. ప్రేమ విఫలం అయిందని జంట బలవన్మరణం

Big Stories

×