సోషల్ మీడియా రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది. లేకపోతే దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. సోషల్ మీడయా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్వర్గధామంగా భావిస్తున్నా.. వాడకం మితిమీరితే నరకప్రాయంగాను మారనుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సాప్ ఇలా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మునిగి తేలుతున్నారు. ఎంతలా అంటే.. ఒక మనిషిని ఎలా చంపాలో కూడా సోషల్ మీడియాలో చూసి నేర్చుకునేంతలా.. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. టీచర్ మీద కక్షతో స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో చూసి చంపాలని స్కెచ్ వేశారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
స్కూల్‌లో టీచర్‌పై కోపంతో ఆమెను చంపేయడానికి కొంత మంది స్టూడెంట్స్ పెద్ద ప్లానే వేశారు. టీచర్‌ను ఎలా చంపేయాలి అంటూ నెట్‌లో బాగా సెర్చ్ చేశారు. అయితే ఆ స్టూడెంట్స్‌కు ఓ ఐడియా వచ్చింది. టీచర్‌ను ఎవరికి అనుమానం రాకుండా.. బాత్‌రూమ్‌లో చంపేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఇంకేముంది అదే ప్లాన్ అమలు చేశారు. కానీ ఇక్కడ స్టూడెంట్ల్ ప్లాన్ మాత్రం రివర్స్ అయింది. కట్ చేస్తే పోలీసులు ఎంటర్ అయ్యారు.
ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌లో కక్ష్య పెంచుకుని, ఆ టీచర్‌ను చంపాలనని చూశారు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్ధులు. టీచర్‌ను చంపేందుకు ఆన్‌లైన్‌లో ఓ వీడియోను చూశారు. సోడియంను నీటిలో కలిపినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆ పిల్లలు తెలుసుకున్నారు. సో ఈ ఐడియా ఏదో బాగుందని ఆ విద్యార్ధులు టీచర్ వాష్‌రూమ్‌కు వెళ్లే టైమ్‌లో.. వాష్ రూమ్ లో ఉండే నీటి తొట్టెలో అంటే.. సోడియం కలిపారు. ఆ తర్వాత టీచర్ ఎప్పుడు వాష్‌రూమ్‌కి వెళుతుందా అని ఎదురు చూస్తూ.. నిల్చున్నారు.
Also Read: యువతిని ఛేజ్ చేసిన తాగుబోతులు.. తప్పించబోయి దుర్మరణం
కానీ ఇక్కడే షాకింగ్ ఘటన జరిగింది. పిల్లల ప్లాన్ బెడిసికొట్టింది. వాష్‌రూమ్‌లోకి టీచర్ ఎప్పుడు వస్తుందా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉండగా.. అనుకోకుండా అదే వాష్ రూమ్‌లోకి నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయి వెళ్లింది. ఆ అమ్మాయి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్లష్ బటన్ నొక్కగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆ అమ్మాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్కూల్ సిబ్బంది డోర్స్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను హాస్పటల్‌కు తరలించగా పరిస్థితి మరీ విషమంగా ఉందని తెలిసింది. ఇక పేలుడుకు కారణమైన ఈ ఐదుగురు స్టూడెంట్స్‌ను పోలీసులు సీసీ కెమరా ఆధారంగా గుర్తించారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.