BigTV English

Orange Peel Face Pack: సమ్మర్‌లో తక్షణ మెరుపు కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి !

Orange Peel Face Pack: సమ్మర్‌లో తక్షణ మెరుపు కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి !

Orange Peel Face Pack: నారింజ చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది నారింజ తిని వాటి తొక్కలు పాడేస్తుంటారు. కానీ నారింజ తొక్కలు కూడా ఆరోగ్యానికి , చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నారింజ తొక్కలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి.


ఈ పీల్స్ తో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ ప్యాక్‌లు ముఖానికి లోతైన శుభ్రపరచడంతో పాటు మెరుపు, పోషణను అందిస్తాయి. మరి నారింజ తొక్కలతో తయారుచేసిన ఉత్తమ ఫేస్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నారింజ తొక్కలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌లను ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. అంతే కాకుండా ఇది మచ్చలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్‌ను కూడా తగ్గిస్తుంది.


నారింజ తొక్కతో ఫేస్ ప్యాక్‌ల తయారీ :

నారింజ తొక్క, పెరుగుతో ఫేస్ ప్యాక్:
నారింజ తొక్కల పొడి , పెరుగు కలిపి అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేసి తేమను అందిస్తుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగాగా ఉంచుతుంది. ఈ ప్యాక్ ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేసి, ఆ తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారి లోతైన పోషణ లభిస్తుంది.

నారింజ తొక్క, తేనె ఫేస్ ప్యాక్:
నారింజ తొక్కల పొడిలో తేనె కలపడం ద్వారా సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ప్యాక్‌ను తయారు చేయవచ్చు. తేనె చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే నారింజ తొక్కలలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి, ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి. ఈ ప్యాక్ చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించి ముఖానికి మెరుపును తెస్తుంది.

నారింజ తొక్క, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్:
నారింజ తొక్క పొడి, ముల్తానీ మిట్టిని కలిపితే అద్భుతమైన టాన్ రిమూవల్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ముల్తానీ మట్టి చర్మం నుండి మురికి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మ కాంతిని కూడా పెంచుతుంది. మీ చర్మం తాజాగా, ప్రశాంతంగా ఉండటానికి వారానికి ఒకసారి దీన్ని ఉపయోగించండం మంచిది.

నారింజ తొక్క, కలబంద ఫేస్ ప్యాక్:
నారింజ తొక్క పొడి , తాజా కలబంద జెల్ మిశ్రమం కూలింగ్ ప్యాక్‌గా పని చేస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చల్లదనం, ఉపశమన ప్రభావాన్ని అందిస్తాయి. ఈ ప్యాక్ వడదెబ్బ, చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేయడం వల్ల చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

Also Read: ఈ టోనర్లతో.. చందమామ లాంటి ముఖం

నారింజ తొక్క, గంధపు ఫేస్ ప్యాక్:
నారింజ తొక్కల పొడి, గంధపు పేస్ట్ కలపడం ద్వారా ముఖానికి తేమను ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు. గంధం చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా ప్రకాశవంతం చేస్తుంది. నారింజ తొక్కలోని విటమిన్ సి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇది ముఖ్యంగా జిడ్డుగల, మొటిమలకు గురయ్యే చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×