BigTV English

Five Eyes Canada Trump: రహస్య కూటమి నుంచి కెనడాను తప్పించేందుకు అమెరికా ప్లాన్.. పట్టువీడని ట్రంప్

Five Eyes Canada Trump: రహస్య కూటమి నుంచి కెనడాను తప్పించేందుకు అమెరికా ప్లాన్.. పట్టువీడని ట్రంప్

Five Eyes Canada Trump| అమెరికా, కెనడా మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా తన ప్రధాన మిత్ర దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన రహస్య ఇంటెలిజెన్స్ కూటమి ‘ఫైవ్ ఐస్’ నుంచి కెనడాను బహిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌నకు అత్యంత సన్నిహిత సలహాదారుల్లో ఒకరైన పీటర్ నవర్రో ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. కెనెడా పై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఈ ప్రతిపాదనకు ట్రంప్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పీటర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన సమయంలో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బ్రిటన్‌ను కూడా విమర్శించారు. అక్కడ పెరుగుతున్న వలస ముస్లిం జనాభాను ఎత్తిచూపుతూ, బ్రిటన్ అణ్వాయుధాలు కలిగిన దేశంగా మారుతోందని ఆరోపించారు. ట్రంప్ ప్రధాన అజెండా అయిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ను సాధించడానికి, ఇంగ్లీష్ మాట్లాడే మిత్ర దేశాలను దూరం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టును పీటర్ నాన్సెన్స్ అని తిరస్కరించారు.

మరోవైపు, ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కెనడాను 51వ రాష్ట్రంగా పరిగణించి, దానిని అమెరికాలో విలీనం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోను గవర్నర్‌గా సంబోధించారు. ఇటీవల, కెనడాపై ఒత్తిడి తెచ్చేందుకు 25% సుంకాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సుంకాలు మార్చి నుంచి అమలులోకి రావనున్నాయి.


ఇరు దేశాల మధ్య వందేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు
రెండో ప్రపంచ యుద్ధంలో ఇంటెలిజెన్స్ సహకారం కీలక పాత్ర పోషించిందని గుర్తించిన అమెరికా, యూకే 1946లో UKUSA ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం ఒక కూటమి ఏర్పాటు చేయబడింది. తర్వాత ఈ కూటమిని రెండుసార్లు విస్తరించారు. 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఈ కూటమిలో చేరాయి. దీంతో ఇది ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్’గా రూపాంతరం చెందింది.

Also Read: ట్రంప్ కొత్త ఆఫర్.. పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్

ఈ కూటమిలోని సభ్య దేశాల నిఘా ఏజెన్సీలు అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం పనిచేస్తాయి. ఈ దేశాలు పరస్పరం సమాచార సేకరణలో సహకరించుకోవడం, కీలక విషయాలు పంచుకోవడం వంటివి ఈ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం. మానవ మేధ, భద్రతా సమాచారం, సిగ్నల్ ఇంటెలిజెన్స్, భౌగోళిక-అంతరిక్ష నిఘా సమాచారం, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఈ దేశాలు పరస్పరం పంచుకుంటాయి. సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్, రాడార్, ఆయుధ వ్యవస్థల కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్ సిగ్నళ్లను సేకరించడం. ఉపగ్రహాల ద్వారా లభించే డేటాను కూడా ఇవి పంచుకుంటాయి. ఈ ఐదు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఈ ఐదు దేశాలు ఆంగ్ల భాషను ప్రధానంగా మాట్లాడే దేశాలు కావడం విశేషం. భారత్‌తో ఖలిస్థానీ వివాదం సమయంలో, కెనడా ఈ కూటమిని అడ్డంపెట్టుకొని మీడియాకు అవాస్తవ సమాచారాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా కెనెడా
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఇన్నాళ్లు అమెరికా ఉక్రెయిన్ కు అండగా ఉండేది. కానీ ట్రంప్ అమెరికా ప్రెసిండెంట్ అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. యుద్ధంలో ఉక్రెయిన్ కు సాయం చేస్తే మాకేంటి ఒరిగేది? అని ట్రంప్ రష్యాతో దోస్తీ చేస్తున్నారు. అందుకు తగ్గుటుగానే యుద్ధం ముగింపు ఐక్యరాజ్యసమితిలో యూరోప్ దేశాలకు వ్యతిరేకంగా అమెరికా, రష్యాతో కలిసి ఓటువేసింది. దీంతో అమెరికా వీడినా ఉక్రెయిన్ కు యురోప్ దేశాలు మద్దతుగా ఉన్నాయి. అయితే అనూహ్యం అమెరికా పొరుగు దేశం కెనెడా కూడా ఉక్రెయిన్ కు బాసటగా నిలబడింది. ఒక వైపు ట్రంప్ కెనెడా ఒత్తిడి చేస్తున్నా.. కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో యురోప్ దేశాలతో కలిసి ఉక్రెయిన్ కు వెళ్లారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఐరోపా దేశాలు, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సహా అనేక నేతలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల తర్వాత, ట్రూడో శాశ్వత శాంతి కోసం ఉక్రెయిన్ చేస్తున్న పోరాటంలో ఒంటరిగా గెలుపు సాధించడం కష్టమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి తాము వారికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

“రష్యా దురాక్రమణ నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య దేశంలో జీవించడానికి ఉక్రెయిన్ ప్రజలు అర్హులు. అది సాధించేవరకు కెనడా వారికి మద్దతుగా ఉంటుంది” అని ట్రూడో అన్నారు. ఇందులో భాగంగా, అదనపు సైనిక సహాయాన్ని కీవ్‌కు పంపించినట్లు ప్రకటించారు. యుద్ధం ముగింపు విషయంలో రష్యా బాధ్యత వహించడం లేదని ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందనగా, పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకునే రష్యన్ ‘షాడో ఫ్లీట్’ నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఈ నౌకల ద్వారా రష్యా అంతర్జాతీయ చట్టాలు, ఆంక్షలను ఉల్లంఘిస్తూ ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతి చేస్తోంది.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×