BigTV English

Bengal Crime : యువతిని ఛేజ్ చేసిన తాగుబోతులు – తప్పించుకోబోయి దుర్మరణం

Bengal Crime : యువతిని ఛేజ్ చేసిన తాగుబోతులు – తప్పించుకోబోయి దుర్మరణం

Bengal Crime : అర్థరాత్రి వేళ తాగి, వెంభడిస్తున్న యువకుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి.. కారు బోల్తా పడి ఓ యువతి మరణించిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు యువతులకు గాయాలుకాగా.. వెంటబట్ట యువకులు తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. 27 ఏళ్ల సుతంద్ర చటోపాధ్యాయ అనే యువతి కారు ప్రమాదంలో మరణించింది. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. నిందితులు ఆమె కారును వెంబడించినట్లు గుర్తించారు.


పశ్చిమ బెంగాల్, హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్ కు చెందిన సుచంద్ర ఓ ఈవెంట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. కంపెనీ పని మీదు బీహార్‌లోని గయాకు వెళుతుండగా.. ఓ చోట పెట్రోల్ పంప్ దగ్గర ఆగి ట్యాంకు నింపుకున్నారు. అప్పుడే.. అక్కడ వారిని చూసిన కొందరు మద్యం మత్తులోని యువకులు వీరిని టీజ్ చేశారు. వారిని పట్టించుకోకుండా.. వెళుతున్న యువతుల వాహనాన్ని ఫాలో అయిన దుండగులు.. పనాగఢ్ దగ్గర ఓవర్ టేక్ చేసి కారును అడ్డగించారు. దాంతో.. కారులోని యువతులు భయంతో బిక్కుబిక్కుమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న వారి నుంచి తప్పించుకునేందుకు.. హైవేలోని సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించారు. ఆ ప్రయత్నంలో యువతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. దాంతో.. కారులోని సుచంద్ర చటోపాధ్యాయ అనే యువతి మరణించింది. ఆమెను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ప్రమాదం తర్వాత దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. దాంతో.. సుచంద్ర సహచరుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు. అందులో.. ఆల్కహాల్ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీరు ప్రయాణించిన మార్గంలోని సీసీ టీవీ కెమెరాలను సైతం పరిశీలించిన పోలీసులు.. దుంగడులు కారును వెంబడించిన విజువల్స్ లభించాయి. అయితే.. వారు ఈవ్ టీజింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించలేదన్నారు.


8 నెలల క్రితమే భర్త మృతి, ఇప్పుడు కూతురు

ఈ ప్రమాదంలో మరణించిన సుచంద్ర చటోపాధ్యాయ తల్లి తనుశ్రీ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. 8 నెలల క్రితం తన భర్తను కోల్పోయానని, ఇప్పుడు.. తనకు ఆధారంగా ఉన్న ఏకైక కూతురు కూడా మరణించడంతో ఏం చేయాలో తెలియడం లేదంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తన కూతురుకు ఆ పరిస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

Also Read : Crime news: రేప్ కేసు పెట్టడానికి వెళ్లిన యువతిపై పోలీస్ అత్యాచారం.. ఛీ, మరీ ఇంత దారుణమా!

కాగా.. ఈ ప్రమాదం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ఆరోపణలకు కారణం అయ్యింది. మమత పరిపాలనలో మహిళలకు రక్షణ లేదని, హైవే పైనే యువతులకు వేధింపులు ఎదురవుతుంటే ఎలా అని ప్రతిపక్షం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సుకాంత మజుందార్ విమర్శించారు. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో మహిళలు ప్రతిచోటా అసురక్షితంగా ఉన్నారు. అది ఆసుపత్రులు లేదా రహదారులు కావచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మహిళలపై భయంకరమైన నేరాలు నమోదవుతున్నాయి, అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండి, న్యాయం చేయడానికి బదులుగా నేరస్థులను కాపాడుతోందంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై స్పందించిన టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. పోలీసులు వారి పని వారిని చేసుకోనివ్వాలని, కేసు దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని అన్నారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×