E-Paper
Advertisement

కన్నతండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కన్నతండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Jangaon: జనగామ జిల్లాలో కేవలం నాటుకోడి కూర వండాలనే చిన్న పట్టింపు, ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో కన్నతండ్రిపైనే రోకలిబండతో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఓ కొడుకు. ఈ ఘోర కలి తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో వెలుగుచూసింది.

స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఇంటికి నాటుకోడి తెచ్చి, దానిని వండాలంటూ తన భార్య అనూషతో గొడవకు దిగాడు. అయితే, ఇంట్లో అప్పటికే ‘చేపల కూర’ ఉందని, ఇప్పుడు మళ్లీ కోడికూర ఎందుకని అనూష వారించింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహానికి లోనైన రమేష్.. భార్యను దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు.

Advertisement

అదే సమయంలో అక్కడే ఉన్న వారి కుమారుడు గణేష్.. తన తల్లిని ఎందుకు కొడుతున్నావంటూ తండ్రి రమేష్‌ను నిలదీశాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆ కోపంలో గణేష్ పక్కనే ఉన్న రోకలిబండను తీసుకుని తండ్రి తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో రమేష్ తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు.

తీవ్ర గాయాలపాలైన రమేష్‌ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రమేష్ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన కుమారుడు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్న విషయానికే తండ్రి ప్రాణాలు పోవడం, కొడుకు జైలుపాలు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Also Read: ఫామ్‌హౌస్‌లో ‘పెద్ద శుక్రాచార్యుడు’.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×