Hyderabad Crime News: కష్టపడటానికి ఇష్టం లేని కొందరు వ్యక్తులు కన్న తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టారు. వారి సంపాదించిన ఆస్తి కోసం కన్నేశారు. ఇవ్వనని మొండి కేస్తే చంపేయడం కొడుకుల వంతైంది. ఇలాంటి ఈ ఘటనలు దేశంలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటున్నాయి. లేటెస్టుగా శంషాబాద్‌లో అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.
శంషాబాద్‌లో దారుణం
ఆస్తి కోసం తల్లిని అతి దారుణంగా చంపేశాడు కన్న కొడుకు. శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో ఉంటోంది రాచమల్ల చంద్రకళ. ఆమె వయస్సు 55 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె కొడుకు వద్దే ఉంటోంది. అయితే పెద్దకొడుకు రాచమల్ల ప్రకాశ్‌కి 38 ఏళ్లు.
మూడు పెళ్లిళ్లు
గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలీదు. కొన్నాళ్ల కిందట మూడో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి శంషాబాద్ మున్సిపాలిటీలోని రాఘవేంద్రకాలనీలో చంద్రకళకు 100 గజాల్లో ఇళ్లు ఉంది. ఆ ఇంటిని అన్నదమ్ములకు పంచి ఇవ్వాలని తల్లిని నిత్యం వేధిస్తున్నాడు పెద్ద కొడుకు ప్రకాశ్.
తల్లితో గొడవలు
జులాయిగా తిరగడానికి ఇష్టపడిన ప్రకాశ్, ఆ తర్వాత చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఎప్పుడు చూసినా మద్యం మత్తులో కనిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు సైతం లేకపోలేదు. బుధవారం రాత్రి పుల్‌గా మద్యం పుచ్చుకున్నాడు. ఆ మత్తులో ఆస్తి కోసం తల్లితో గొడవపడ్డాడు.
ALSO READ: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. బాలకృష్ణ ఇంటి ముందు ఘటన
దీంతో ఆగ్రహానికి లోనైన ప్రకాష్, తల్లి తలను గ్యాస్ సిలెండర్ గట్టిగా మోదాడు. ఆ తర్వాత కట్టెలతో తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలు పాలైంది. కాసేపటికి ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడ రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసుల అదుపులో నిందితుడు
చంద్రకళను వెంటనే చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్ఠం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తల్లిని చంపిన ప్రకాశ్‌ను ఆదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా దారుణం
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతిపై మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన దిగారు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్. జగిత్యాల జిల్లాలో శ్రీ రామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు మృతుడు. గల్ఫ్‌లో ఉద్యోగాల పేరిట సంపత్ తమను మోసం చేశారని సైబర్ పోలీసులకు నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది బాధితుల ఫిర్యాదు చేశారు.
దీంతో మార్చి నాలుగున సంపత్‌తోపాటు మరో యువకుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు పోలీసులు. విచారణ పేరిట ఈనెల 12న కస్టడీలోకి తీసుకున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ, రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. విచారణ పేరిట తమ కొడుకు సంపత్‌ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు మృతిని కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆసుపత్రి ఎదుట రాస్తా రోకో నిర్వహించారు మృతుని బంధవులు. దీనికి గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.