Car Accident: వీకెండ్ లేదా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు వాహనాదారులు ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ దూసుకుపోతారు. అతివేగం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు సైతం లేకపోలేదు. చాలామంది మరణించారు కూడా.
తాజాగా శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-1లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్ పాత్‌పైకి వేగంగా దూసుకెళ్లింది ఓ కారు. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటువైపుగా వస్తున్న వాకర్స్ ఈ ఘటనను చూసి షాకయ్యారు.
కొద్దిక్షణాల్లో తాము బతికి బయటపడ్డామని, లేకుంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటనకు డ్రైవర్ నిద్రమత్తు కారణమని చెబుతున్నారు. మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అతివేగంతో దూసుకొచ్చిన కారును చూసి అక్కడున్నవారు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ డ్యామేజ్ అయ్యింది. అలాగే కారు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: గ్రిల్స్ కి గోడకు మధ్య ఇరుక్కుని
ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలైనట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన నెలరోజుల వ్యవధిలో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు.
గుజరాత్‌లో ఇలాంటి ఘటన
గుజరాత్‌లో కారు బీభత్సం సృష్టించింది. వడోదరాలో మద్యం మత్తలో ఓ యువకుడు 100 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ బైక్ ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు గాయపడ్డారు. ఘటన అనంతరం కారు దిగి గట్టిగా అరుస్తూ వెళ్లాడు నిందితుడు. చివరకు కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.